![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan Met With Modi: ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
AP DVM Pawan Kalyan News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పీఎం మోదీతో సమావేశమయ్యారు. కేంద్రం అందిస్తున్న సాయంపై కృతజ్ఞత తెలిపారు. రాజకీయాలపై చర్చించారు.
![Pawan Kalyan Met With Modi: ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే andhra pradesh deputy cm pawan kalyan met with Prime Minister Modi in delhi Pawan Kalyan Met With Modi: ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/27/4efd4a8494d81321fc0dc260479cbd121732700160300215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pawan Kalyan Delhi Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న మోదీని పవన్ కల్యాణ్ అక్కడే కలిసి దాదాపు అరగంట పాటు మాట్లాడారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొన్న ఢిల్లీ వెళ్లి పవన్... మంగళవారం వివిధ కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించినట్టు సమాచారం.
ఎర్రచందనం వాట కోసం రిక్వస్ట్
అంతకు ముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని కోరారు. ఫలితాలు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని పవన్ తెలియచేశారు. "‘‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది.
ఏ రాష్ట్రంలో పట్టుబడినా...
ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్‌గా ఉండే ఏపీకే దక్కేలా చూడాలి. రాష్ట్రంలో పట్టుబడిన ఎర్రచందనం ఆ రాష్ట్రం అమ్ముకోవడానికి వీలు లేకుండా చేయాలి. ఫలితంగా అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్‌గా కొనసాగుతుంది. అని కేంద్రమంత్రికి సూచించరు.
Also Read: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జగన్ అవినీతిపై చర్చించి నిర్ణయం
కేంద్రమంత్రితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్... జగన్‌కు అదానీ ముడుపుల విషయంపై మాట్లాడారు. ప్రభుత్వంలో దీనిపై చర్చించిన కేబినెట్‌లో మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సమగ్రంగా చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్ర చందనం అమ్మకాల్లో వాటాల అంశాన్ని చర్చిస్తామన్నారు.
అంతా ఏకమై ఎదుర్కోవాలి
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై స్పందించారు ఇలాంటి అంశాలపై ఒక్కటిగా పోరాడాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కలచివేస్తోందని అన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌కు అభ్యర్థించారు పవన్ కల్యాణ్. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్త చిందించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 సిలబస్ విడుదల- ఎస్జీటీ అభ్యర్థులు చదువుకోవల్సిన అంశాలు ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)