By: RAMA | Updated at : 23 Mar 2023 01:14 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Sri Rama Navami Special 2023: శోభకృత్ నామసంవత్సరంలో శ్రీరామనవమి మార్చి 30 గురువారం వచ్చింది. ఈ సందర్భంగా రామచంద్రుడి గురించి ఏబీపీ దేశం ప్రత్యేక కథనం
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు.
అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే. అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయడు ( కృష్ణావతారంలో తానే భగవంతుడిని అని చెబుతాడు కృష్ణుడు)
“రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది. అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం .ఆయన నడక ఆయన కదలిక అంతా సత్యం ధర్మమే అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .
Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!
రాముడు ధర్మం తప్పిఉంటే రామాయణంలో కొన్ని కాండలు లేవు
తన అవసరం కోసం ధర్మాన్ని పక్కనపెట్టేసి ఉంటే..కిష్కిందకాడంలో సుగ్రీవుడితో స్నేహం మానేసి వాలితో స్నేహం చేస్తే చాలు సమస్య వెంటనే పరిష్కారం అయిపోయేది. ఎందుకంటే రావణుడు తన జీవితకాలంలో ఓడిపోయింది వాలి, కార్తావీర్యార్జునుడు, మాంధాత చేతిలోనే. అందుకే రావణుడు వాలితో స్నేహం చేశాడు. అదే వాలితో రాముడు చేయి కలిపి ఉంటే సీతను తీసుకొచ్చి అప్పగించేవాడే..కానీ రాముడు ఆపని చేయలేదు. అధర్మపరుడైన వాలితో స్నేహం కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి, సేతువు నిర్మించి , రావణుడితో యుద్ధం చేసి సీతను పొందాడు. రాముడు ధర్మాన్ని ఆచరించాడని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి.
అందుకే పెద్దలు ఏం చెబుతారంటే రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలి అని. రాముడు దేవుడు అని కాకుండా మానవుడు అని చదివినప్పుడే..ఓ మనిషి సత్యం, ధర్మం పట్టుకుని ఇలా జీవించగలడా అనే ఆలోచన వస్తుంది
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. శ్రీ రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం వస్తుందని ఈ శ్లోకం భావం.
Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్నింటా జయమే, ఆదాయం-గౌరవం-ఉద్యోగం అన్నింటా అనుకూలమే!
అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం “య” వర్గంలో “రా” రెండవ అక్షరం కాగా “ప” వర్గం లో “మ ” ఐదవ అక్షరం రెండు * ఐదు =పది కదా , దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం .ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10 =1000 కి సమానమవుతుంది . అందుకే పరమశివుడు అలా నిర్వచించాడట.
నవమి తిథిలోనే ఎందుకు జన్మించారు
స్వామివారు జన్మించిన నవమి తిథి విషయానికొస్తే...నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది. తొమ్మిదిని ఏం సంఖ్యతో హెచ్చించినా ఆనంబర్స్ కలిపితే మళ్లీ తొమ్మిదే వస్తుంది.
9*1=9
9*2=18 — 8+1 =9
9*3=27 — 2+7=9
9*4=36 — 3+6=9
9*5=45 — 4+5=9
దీనికి పరమాత్మ చిహ్నానికి సంబంధం ఏంటంటే..ఆయన ఎన్ని రూపాల్లో ఉన్నా ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలుతత్వం ఒక్కటే అని. శ్రీరాముడు నవమి రోజు జన్మించడం వెనుకున్న ఆంతర్యం ఇదే.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
Bhagavad Gita Sloka: గీతాసారమంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది
Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శని అనుగ్రహం ఖాయం
Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Evil eye signs: మీపై, మీ కుటుంబంపై నరదిష్టికి సంకేతాలు ఇవే
జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్
Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్
Hyderabad News: భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్‌లెన్స్, హెచ్ఆర్డీ కేంద్రం
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు