Rishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam
ఐపీఎల్ వేలానికి మరికొద్ది రోజులే గడువు ఉంది. ఈనెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగనున్న ఐపీఎల్ లో ఆక్షన్ లో మార్కీ ప్లేయర్లను దక్కించుకోవాలని ప్రతీ ఐపీఎల్ జట్టూ కోరుకుంటూ ఉంటుంది. కానీ ఉన్న 12 మార్కీ ప్లేయర్లలో టాప్ ప్రయారిటీ అంటే యునానిమస్ గా వినిపిస్తున్న పేరు రిషభ్ పంత్. ఇన్నాళ్లూ ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా ఉన్న పంత్ ను వదిలేసుకుంది డీసీ. కానీ ఈ నిర్ణయం వ్యూహాత్మకమా లేదా ఢిల్లీ వదిలించుకుందా అన్న క్లారిటీ కొద్ది రోజుల్లో రానుంది. వాస్తవానికి పంత్ ఇప్పుడున్న ఫామ్, అతని పోరాట తత్వం, ఫైరింగ్ గేమ్, వికెట్ కీపింగ్ స్కిల్స్ ఈ టీమ్ కైనా అడ్వాంటేజ్ అందుకే డీసీ పంత్ ను వదిలేసుకోవటం కేవలం తన మార్కెట్ ను పెంచేందుకే అంటున్నారు కొంత మంది విశ్లేషకులు. పైగా ఢిల్లీ దగ్గర రైట్ టూ మ్యాచ్ కార్డ్ ఉంటుంది. ఎవరైనా పంత్ ను ఎక్కువ డబ్బులకు పాడుకున్నా...ఢిల్లీ రైట్ టూ మ్యాచ్ అధికారం కింద వాళ్ల దగ్గర నుంచి పంత్ ను అదే అమౌంట్ కు తీసుకోవచ్చు. కానీ పంత్ ను దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. రీజన్ చెన్నైకి ఓ స్ట్రాంగ్ వికెట్ కీపర్ కావాలి అది కూడా వచ్చే ఐదారేళ్లకు టీమ్ అవసరాలను అతను తీర్చగలగాలి. సో ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ రిషభ్ పంత్. అచ్చం ధోనిని తలపించే స్కిల్స్ తో ఉండే పంత్ అయితేనే చెన్నైకి అండగా ఉండగలుగుతాడని సీఎస్కే భావిస్తోంది. ఇదేలా హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ కూడా ఆలోచిస్తున్నాయి. క్లాసెన్ ను ఒత్తిడి తగ్గించేలా పంత్ ను తీసుకోవాలని SRH భావిస్తుంటే...కేఎల్ రాహుల్ వదిలేయటంతో లక్నో కూడా కెప్టెన్ కోసం చూస్తోంది. ఇక పంజాబ్ అయితే ఇద్దరు ప్లేయర్లనే రిటైన్ చేసుకుంది కాబట్టి పంత్ కోసం ఎంతైనా పెట్టే అవకాశం ఉంది. మరి పంత్ బాబును ఏ టీమ్ పాడుకుంటుందో...ఈ ప్రాసెస్ లో ఇప్పటివరకూ టోర్నీ చరిత్రలో అత్యధిక ధర పలికిన మిచెల్ స్టార్క్ 24 కోట్ల 75లక్షలను పంత్ బ్రేక్ చేస్తాడని..30కోట్ల రికార్డును క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.