అన్వేషించండి

Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?

MLA Anirudh Reddy : పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజోలులో పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై ఇలా స్పందించారు.

Telangana Congress MLA Anirudh Reddy demands apology from Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. కోనసీమ పచ్చదనం అంశంలో తెలంగాణకు ముడిపెట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుతూ తెలంగాణ నాయకుల "దిష్టి" వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పడంతో తెలంగాణ రాజకీయ నేతలు విమర్శలుచేస్తున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే డి. అనిరుధ్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.   పవన్ సినిమా 'ఓజీ'కు 800 రూపాయల టికెట్ ధర పెట్టి కొని ప్రొడ్యూసర్లను కాపాడామని, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు.  

కోనసీమలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యలు                

నవంబర్ 26న గోదావరి జిల్లాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నాయకులు గోదావరి పచ్చదనాన్ని చూసి ఆసూయ చెందారన్నారు.  గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అని పవన్ పలికారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇన్నేళ్లు మీ దిష్టి మా తెలంగాణకు తాకింది  అని కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు తెలివితక్కువ మాటలని అని జగదీష్ ఘాటుగా స్పందించారు.   

ఓజీ సినిమాను రూ. 800 పెట్టి చూశామన్న ఎమ్మెల్యే               

కాస్త ఆలస్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందించారు.  పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. నీ ప్లాప్ అయిన సినిమా కూడా ప్రొడ్యూసర్లు బతకాలని 800 టికెట్ ధర పెట్టి చూసాము. కానీ నువ్వు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.   సెప్టెంబర్ 2025లో విడుదలైన ఓజీ  సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు 800 రూపాయల వరకు టికెట్ ధర పెంచే అనుమతి ఇచ్చింది.                

ఇప్పటికే పవన్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు                
    
 తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్‌పై ఏకకాలం దాడి చేస్తున్నారు. ఆంధ్రలో టీడీపీ-జనసేన కూటమి మౌనంగా ఉంది. పవన్ కళ్యాణ్ త్వరలో క్షమాపణ చెప్పకపోతే, ఈ వివాదం మరింత ఊపందుకుంటుందని రాజకీయ  వర్గాలంటున్నాయి. తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరచడం ద్వారా పవన్ తన ఇమేజ్‌ను దెబ్బతీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.


  

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget