Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Deputy CM Pawan: కోనసీమ విషయంలో పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. నోటి అదుపులోని వారు సీఎంలు, డిప్యూటీ సీఎంలు అయిపోతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు.

BRS leaders criticizing Pawan On Evileye comments : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోనసీమలో చేసిన 'దిష్టి' వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్ర విభజనకు కారణం. దిష్టి కోనసీమపై తగిలి, కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటూ బుధవారం పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Godavari districts greenery is the reason the state was separated. Telangana people’s evil eye has fallen on Konaseema that coconut trees are dying - Andhra Pradesh Deputy CM Pawan Kalyan pic.twitter.com/1ZadQfbq4N
— Naveena (@TheNaveena) November 26, 2025
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన 'పల్లె పండుగ 2.0' కార్యక్రమం బుధవారం ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. రైతుల సమస్యలు, పశుసంవర్ధన, వ్యవసాయ సాంకేతికతలపై చర్చలు జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని, కోనసీమ కొబ్బరి రైతులతో మాట్లాడారు. "పచ్చని కోనసీమను చూసి తెలంగాణ నేతలు ఈర్ష్య పడ్డారు. ఆ పచ్చదనమే రాష్ట్ర విభజనకు ఒక కారణం. నరుడు దిష్టికి నల్ల రాయి కూడా బద్దలై పోతుంది, కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగింది" అంటూ వ్యాఖ్యలు చేశారు.
Did anyone from here go there to cast an evil eye? If anything, their Dishti will be on us as they come to Hyderabad in huge numbers. Such people end up becoming CM & Dy CM without learning to control their tongue or use their mind. - BRS MLA Jagadish Reddy https://t.co/dLfyBg2Pp6 pic.twitter.com/OHF000xl28
— Naveena (@TheNaveena) November 27, 2025
పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేటలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికి వెళ్లి ఎవరు చూస్తున్నారని.. అక్కడ నుంచి హైదరాబాద్‌కు భారీగా వస్తున్నారన్నారు. భారీ సంఖ్యలో వచ్చి మనపై దిష్టి పెడుతున్నారు. ఇలాంటి వాళ్లు నోటిని అదుపు చేసుకోవడం నేర్చుకోకుండానే సీఎం, డిప్యూటీ సీఎం అవుతున్నారు అని మండిపడ్డారు. నర దిష్టి పడిందంటాం, ఓ చేను వెంట వెళ్తుంటే బాగుంది చేను అంటారనుకొని చేనులో దిష్టిబొమ్మలు పెట్టుకుంటారు. అలాగే అక్కడ దిష్టిబొమ్మలు పెట్టుకోవాలి, ఎవరు వద్దంటారు, ఆ స్థాయిలో ఉండి మాట్లాడేవారు కనీసం సోయి తెచ్చుకొని మాట్లాడాలని పవన్ కల్యాణ్‌కు సూచించారు.





















