అన్వేషించండి

Hydra Ranganath: హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ - హైడ్రా రంగనాథ్‌కు హైకోర్టు హెచ్చరిక

Ranganath: కోర్టు ధిక్కరణలకు పాల్పడుతున్నారని హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ ఐదో తేదీలోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.

High Court  ordered Ranganath  to appear in court:  తెలంగాణ హైకోర్టు  హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట  వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణలపై కంటెంప్ట్ పిటిషన్ విచారణలో, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి   గురువారం కీల వ్యాఖ్యలు చేశారు.   డిసెంబర్ 5లోపు ప్రత్యక్షంగా హాజరు కాకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేస్తామని స్పష్టం చేశారు.  
 
బతుకమ్మకుంట, హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలో 16.13 ఎకరాల  విస్తీర్ణంలో ఉన్న చారిత్రక చెరువు. 1962లో 14 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ చెరువు, అనధికార ఆక్రమణలతో 5.15 ఎకరాలకు మాత్రమే  పరిమితమయింది.  మాజీ కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు ఫిర్యాదుపై HYDRA  2024 నవంబర్ 13న చెరువు పరిశీలించి, పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. కానీ, బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఈ భూమి తన ప్రైవేట్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసి, హైకోర్టును ఆశ్రయించారు.

2025 ఫిబ్రవరిలో హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. మార్చిలో HYDRAA రివ్యూ పిటిషన్ డిస్మిస్ అయింది. మేలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే పనులు చేయడంతో రంగనాథ్, రంగారెడ్డి కలెక్టర్, GHMC డిప్యూటీ కమిషనర్‌లకు కోర్టు ధిక్కరణ నోటీసుల ుఇచ్చింది.  ఆగస్టులో మరో  కేసులోనూ నోటీసులు జారీ అయ్యాయి.   సెప్టెంబర్‌లో హైకోర్టు రంగనాథ్‌ను కోర్టులో హాజరు కావాలని సమన్స్ జారీ చేసింది. జనవరి 2025లో సిటీ సివిల్ కోర్టు HYDRAAకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, భూమిని చెరువుగా ధృవీకరించింది.  రెవెన్యూ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, సాటిలైట్ ఇమేజెస్‌ ఆధారంగా ఈ తీర్పు ఇచ్చింది.  అయినప్పటికీ, HYDRAA పనులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని సుధాకర్ రెడ్డి  కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
 
 నవంబర్ 27న జరిగిన విచారణలో, జస్టిస్ విజయసేన్ రెడ్డి HYDRAAపై 'రిపీటెడ్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ' అని వ్యాఖ్యానించారు.  కోర్టు GHMC, HMDA, మున్సిపాలిటీలు, వాటర్ బోర్డు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ల పనులు HYDRAA చేయాలా? అని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు డిమాలిషన్‌కు ముందు నోటీసు, హియరింగ్ వంటివి పాటించకపోవడం, స్టేటస్ కో ఉల్లంఘనలు, పట్టా భూములపై బలప్రయోగం వంటి వాటిని న్యాయమూర్తి ప్రశ్నించారు.  అథారిటీ ప్రజలకు మంచి చేయడానికి ఇచ్చారు కానీ  పవర్ చూపడానికి కాదు. మీరు పవర్ చూపాలనుకుంటే, కోర్టుకు సూపీరియర్ పవర్ ఉంది. కోర్టులను ప్రావోక్ చేయకండి  అని హెచ్చరించారు. రోజువారీ  ధిక్కరణ పిటిషన్లు వస్తున్నాయన్నారు.  కోర్టు తన ఆర్డర్ల విలువ తెలుసు. ఉల్లంఘించితే, కోర్టు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుసు అని మండిపడ్డారు.   డిసెంబర్ 5కు వాయిదా వేసి, ఆ తేదీలోపు రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరు కావాలని, కౌంటర్లు ఫైల్ చేయాలని ఆదేశించింది. హాజరు కాకపోతే NBW జారీ అవుతుందని స్పష్టం చేశారు.                 

  

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget