Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Telangna Kavitha: కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో ఎప్పుడూ ఎలా చర్చనీయాంశంగా ఉండాలో క్లారిటీ ఉంది. భట్టివిక్రమార్క కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చించుకుటున్నారు.

Kalvakuntla Kavitha hot topic in politics: బీఆర్ఎస్ నేతలు కవిత అటెన్షన్ కోసం తమపై ఆరోపణల చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు . కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ఎలా చర్చనీయాంశమయ్యాలో మాట్లాడకుండానే తన వ్యూహం అమలు చేయగల తెలివైననేత. ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చజరుగుతోంది.
తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత ధరించిన తెలుపు చీరపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎరుపు-ఆకుపచ్చ రంగుల డిజైన్ బోర్డర్‌తో అలంకరించిన ఈ చీర, కాంగ్రెస్ పార్టీ కండువా తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ ను గుర్తుచేస్తూ ఉండటంతో అందరూ ఈ అంశంపై చర్చించడం ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన కవిత చీర ఎంపికే రాజకీయ సంకేతమా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. BRS అభిమానులు 'కాంగ్రెస్‌కు మద్దతు' అంటూ విమర్శలు గుప్పిస్తుంటే, కొందరు ఇది సాధారణ జాతీయ రంగుల చీర మాత్రమే అని కౌంటర్ ఇస్తున్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి దంపతుల నిశ్చితార్థ వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, మెగాస్టార్ చిరంజీవి వంటి సెలబ్రిటీలు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. భర్తతో కలిసి కవిత వేడుకు వచ్చారు. కాబోయే దంపతులను ఆశీరవదించారు.
కవిత పూర్తిగా ఆఫ్-వైట్ చీరతో బోర్డర్‌లో ఎరుపు-ఆకుపచ్చ డిజైన్‌లు కనిపించాయి. సాధారణంగా పబ్లిక్ ఈవెంట్‌లలో సింపుల్, కలర్‌ఫుల్ చీరలు ధరించే కవిత ఈసారి ఈ డిజైన్ సెలక్ట్ చేసుకోవడంతో అందరి దృష్టి ఆకర్షించింది. ఈ చీర కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు తో సమానంగా ఉండటంపై 'హింట్' అని అంటూ స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఆమె కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని అంటున్నారు. కానీ అంతకు ముందు అదే చీరతో ప్రెస్ మీట్ పెట్టి.. బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు.
“I am asking @RahulGandhi-ji: Will the reservation be as per the wishes of your chief minister and ministers, or as per constitutional guidelines?” Kavitha questioned as she lashed out at the Telangana Congress government for not implementing BC reservation in the local body… pic.twitter.com/oE0HrBPeLR
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) November 26, 2025
కవిత ఇటీవల BRS పార్టీ నుంచి దూరమయ్యారు. హరీశ్ రావు, సంతోష్ కుమార్ వంటి నేతలపై పబ్లిక్‌గా విమర్శలు గుప్పించారు. తన సొంత పార్టీని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగిందికానీ కాంగ్రెస్‌లో చేరను అని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసి ఆ తర్వాత ఇలాంటి చీరలో కాంగ్రెస్ నేత ఇంటి ఫంక్షన్ కు వెళ్లడం .. ఆమెకు మాత్రమే సాధ్యం.
కవిత కాంగ్రెస్ లో చేరుతారో లేదో కానీ రాజకీయపరంగా ఎలా హాట్ టాపిక్ గా ఉండాలో ఆమెకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని అంటున్నారు.





















