Telangna Lands Issue: ప్రజల్లో చర్చ పెట్టకుండా కీలక నిర్ణయాలు - అందుకే స్కామ్‌ల ఆరోపణలు - తెలంగాణ సర్కార్ ఇరుక్కుపోతోందా?
HILT: ఇండస్ట్రియల్ భూముల రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఐదు లక్షల కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి కాంగ్రెస్ తంటాలు పడుతోంది.

HILT Land scam Allegations: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ రాజకీయగా కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు దీన్ని 5 లక్షల కోట్ల స్కాంగా ఆరోపిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మార్చడం, సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్లలో కేవలం 30 నుంచి 0 శాతం చెల్లింపుతో రెగ్యులరైజేషన్ అనుమతించడం ఈ పాలసీలో కీలకం.
సున్నితమైన అంశం.. కేబినెట్‌లో పెద్దగా ప్రచారం లేకుండా ఆమోదం
HILTP అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ORR లోపల బలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఆజమాబాద్ వంటి ప్రాంతాల్లో 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, పార్కుల్లో 9,292 ఎకరాల భూములను మల్టీ-యూజ్ జోన్లుగా అంటే రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్-యూజ్ మార్చడానికి అనుమతించే పాలసీ. పాత ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఆధునికీకరించి, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా మారుస్తమమని ప్రభుత్వం చెబుతోంది. భూమి యజమానులకు ఫ్రీహోల్డ్ హక్కులు, మల్టీ-యూజ్ అనుమతులు ఇస్తారు. అప్లికేషన్లు 7 రోజుల్లో ప్రాసెస్, 7 రోజుల్లో అప్రూవల్, 45 రోజుల్లో పూర్తి రెగ్యులరైజేషన్ చేస్తారు.
దశాబ్దాల కిందట కేటాయించిన భూములు
తెలంగాణలో పారిశ్రామిక సంస్థలకు ప్రభుత్వం భూములు 1960ల నుంచి ఇస్తున్నారు. హైదరాబాద్ స్టేట్ సమయంలో పారిశ్రామిక అభివృద్ధికి భూములు సబ్సిడీ రేట్లకు కేటాయించారు. అప్పట్లో పెట్టిన షరతు ప్రకారం వాటిని పారిశ్రామిక వినియోగానికి మాత్రమే ఉపయోగించాలి. 2 బీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి భూములు 'ఫ్రీహోల్డ్' హక్కులతో మార్చారు. కానీ మల్టీ-యూజ్ కన్వర్షన్‌లకు కఠిన నిబంధనలు విధించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువ ధరకు.. మల్టీ యూజ్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణియంచారు. ఇండస్ట్రియల్ భూముల్లో టాక్సిక్ పొల్యూషన్ ఉందని అందుకే మా పాలసీలో ఇన్‌ఫ్రా, గ్రీన్ స్పేస్‌లు బిల్డ్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. HILTP అమలు అయితే, రాష్ట్రానికి పన్నెండు వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
స్కాం అని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ,
అయితే ఈ భూములను మార్కెట్ రేటులో ముఫ్పై శాతం మొత్తానికే ఇవ్వడం స్కాం అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలా తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల 5 నుంచి 6 లక్షల కోట్ల నష్టం స్తుందని చెబుతున్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. పంచాయతీ ఎన్నికల ముందు వివాదం తీవ్రమవుతోంది. ఫ్రీహోల్డ్ పేరుతో బీఆర్ఎస్ జీవోలుఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు వాటిని బయట పెట్టారు.
ప్రజల్లో చర్చ పెట్టిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే సమస్య ఉండదు !
ప్రభుత్వాలు నిజంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి గురించి ప్రజలేమనుకుంటున్నారన్నదానిపై చర్చ పెడతారు. ప్రజల మద్దతు లభిస్తుందనుకుంటే దైర్యంగా ముందడుగు వేస్తారు. కానీ ప్రభుత్వం వివాదాస్పదం అవుతుందని తెలిసి కూడా..విపక్ష పార్టీలు బయట పెట్టే వరకూ ప్రజలకు తెలియకుండా సీక్రెసీ మెయిన్ టెయిన్ చేస్తోంది. ఫలితంగానే ప్రభుత్వానికి చిక్కులు వస్తున్నాయి. ఫలితంగా సమర్థించుకోలేకపోతోంది. స్కాం జరుగుతుందేమో అని సామాన్య ప్రజలు భావించేలా చేస్తోంది.





















