అన్వేషించండి

AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా

Aadarsha Kutumbam House No 47 Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శక - రచయిత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'వాసు', 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలకు రచయితగా పని చేసిన గురూజీ... దర్శకుడిగా వెంకీతో చేస్తున్న మొదటి చిత్రమిది. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'ఏకే 47' - యాక్షన్ హింట్ ఒక్కటే కాదు...
ఇది 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'
Venkatesh 77th Movie Titled Aadarsha Kutumbam House No 47 Movie: వెంకీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' టైటిల్ ఖరారు చేశారు. షార్ట్ కట్‌లో 'ఏకే 47' అని పేర్కొన్నారు. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు సినిమాలో వెంకటేష్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. 

'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' సినిమాను శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేష్ 77వ చిత్రమిది.

Also ReadDekhlenge Saala Song Promo: 'దేఖ్‌ లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ

షూటింగ్ మొదలు... వేసవిలో విడుదల!
'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 - ఏకే 47' చిత్రీకరణ మొదలు పెట్టామని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశారన్నమాట.

'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 - ఏకే 47' సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇంతకు ముందు కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కేజీఎఫ్', నాని 'హిట్ 3', సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాల్లో ఆమె నటించారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Also ReadNari Nari Naduma Murari Release Date: బాలయ్య టైటిల్‌తో వస్తున్న శర్వా... రిలీజ్ డేట్ ఫిక్స్ - సంక్రాంతికి హ్యాట్రిక్ కొడతాడా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget