అన్వేషించండి

2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్

Telangana Highcourt: 2019 గ్రూప్ 2 ఇష్యూలో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన వారికి ఊరట లభించినట్లయింది.

Division Bench suspends single bench verdict in 2019 Group 2 issue : తెలంగాణ హైకోర్టులో గ్రూప్-2 2019 ర్యాంకర్లకు గురువారం భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ నవంబర్ 18న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. మెరిట్ లిస్ట్ చెల్లదని ప్రకటించిన సింగిల్ బెంచ్ ఆదేశాలను  నిలిపివేసి  ర్యాంకర్లకు తాత్కాలిక రక్షణ అందించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసిన డివిజన్ బెంచ్, ఈ కేసులో మరిన్ని వాదనలు వినాలని నిర్ణయించింది.            
 
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2015లో 1,032 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2016 నవంబర్‌లో జరిగిన పరీక్షల ఫలితాలు 2019 అక్టోబర్ 24న విడుదలయ్యాయి. అయితే, ఈ ఫలితాలపై తీవ్ర వివాదాలు ఏర్పడ్డాయి. ఓఎమ్‌ఆర్ షీట్లలో  అవకతవకలు, వైటెనర్ ఉపయోగం, ఎరేసర్ మార్కులు, డబుల్ బబులింగ్ వంటివి జరిగాయని గుర్తించారు.  ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో ఇలాంటి షీట్లను మూల్యాంకనం చేయకూడదని సిఫారసు చేసింది. కానీ టీజీపీఎస్సీ ఈ మార్గదర్శకాలను పాటించకపోవడంతో, అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.                  

ఈ విషయంలో సింగిల్ బెంచ్ జస్టిస్ నాగేష్ భీమపాక నవంబర్ 18న కీలక తీర్పు ఇచ్చారు. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను   రద్దు చేస్తూ తీరపు ఇచ్చారు.  మునుపటి డివిజన్ బెంచ్ తీర్పు ,  సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని, అర్హ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని  గడువు విధించింది. ఈ తీర్పు 1,032 మంది ఎంపికైన అధికారులకు షాక్‌గా నిలిచింది.                             

సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ, పలువురు ర్యాంకర్లు , టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలను మధ్యంతరంగా సస్పెండ్ చేసింది. మెరిట్ లిస్ట్‌ను తాత్కాలికంగా పునరుద్ధరించడం ద్వారా, ర్యాంకర్లు తమ స్థానాలను కోల్పోకుండా ఉండేలా చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు ర్యాంకర్లకు పెద్ద ఊరటగా మారాయి, ఎందుకంటే ఇప్పటికే వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. తదుపరి విచారణను జనవరి  మొదటి వారంలో చేపడతారు.  రెండు వైపులా వాదనలు మరింత వివరంగా వినాలని, అందరి హక్కులను రక్షించేలా తీర్పు ఇవ్వాలని బెంచ్ సూచించింది.                                         
 
ఈ వివాదం 2019లోనే మొదలైంది. ఓఎమ్‌ఆర్ షీట్లలో పార్ట్-ఎ మాత్రమే మూల్యాంకనం చేయాలని సాంకేతిక కమిటీ సిఫారసు చేసినా, టీజీపీఎస్సీ పార్ట్-బీని కూడా పరిగణలోకి తీసుకుంది. ఇది మునుపటి డివిజన్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధమని అభ్యర్థులు వాదించారు.  

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget