Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Peddi Reddy Song Lyrics : తెలంగాణ ఫేమస్ ఫోక్ సింగర్ నాగదుర్గ నుంచి మరో ట్రెండింగ్ సాంగ్ 'పెద్దిరెడ్డి' అదరగొడుతోంది. బుల్లెట్ బండి ఫేం లక్ష్మణ్ తన కలం నుంచి మరో అద్భుతమైన లిరిక్స్ అందించారు.

Naga Durga's Peddi Reddy Folk Song Lyrics : 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా... డుగ్గు డుగ్గు డుగ్గని...' పల్లెటూరిలో ఓ అందమైన అమ్మాయి తనకు కాబోయే భర్తను ఊహించుకుంటూ తేట తెలుగు పల్లెపదంతో తెలంగాణ జానపదాన్ని పలికిన గీతం. ఇప్పటికీ పెళ్లిళ్లలో ఈ పాట ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ పాటను జానపద శైలిలో సినిమా హంగులతో ప్రతీ ఒక్క యువతీ యువకుల మదిని తట్టేలా రాశారు లక్ష్మణ్. ఇప్పుడు ఆయన కలం నుంచి మరో ట్రెండీ జానపదం 'పెద్దిరెడ్డి' జాలువారింది.
తెలంగాణ ఫేమస్ ఫోక్ సింగర్, డ్యాన్సర్ నాగదుర్గ 'పేరుగల్ల పెద్దిరెడ్డి' అంటూ మరోసారి అందరి మనసులు టచ్ చేస్తున్నారు. పల్లెటూరి నేచుర్, జానపదాల లయను ప్రతిబింబించేలా నాగదుర్గ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఓ తండ్రిపై కూతురు చూపించే ప్రేమను నేపథ్యంగా అద్భుతంగా లిరిక్స్ రాశారు బుల్లెట్ బండి ఫేం లక్ష్మణ్. శుక్రవారం ఈ సాంగ్ రిలీజ్ చేయగా ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో దుమ్ము రేపుతూ... మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాటను మమత రమేష్ పాడగా... మదన్ కే మ్యూజిక్ అందించారు. మరి ఆ ట్రెండింగ్ సాంగ్ లిరిక్స్ మీకోసం...
పేరుగల్ల పెద్దిరెడ్డి...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...
కోరా మీసాలు దువ్వుతూ మా నాయనా కోరొక్క కూత పెడితేనే ఓ నాయనా...
పెద్దపులంత సప్పుడే మా నాయనా... తప్పే ఒప్పేసుకుంటరే...
ఊరంత పెద్దోడు నా ముందు పసోడు...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...
నేనూ పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన...
మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయనా...
నేనూ పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన...
మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయనా...
మా నాయిన గుండె తొట్టేళ్ల చేసి నన్ను ఊయల్ల ఊపినంటెనే...ఏ..ఏ..ఏ
పేరుగల్లా... పేరుగల్లా...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...
పట్టా గొలుసులూ తెచ్చెనే ఓ నాయన... పెట్టి మురిసిపోయెనే మా నాయన...
పట్టూ లంగాలు తెచ్చెనే ఓ నాయన... కట్టి మురిసిపోయెనే మా నాయన...
పట్టా గొలుసులూ తెచ్చెనే ఓ నాయన... పెట్టి మురిసిపోయెనే మా నాయన...
పట్టూ లంగాలు తెచ్చెనే ఓ నాయన... కట్టి మురిసిపోయెనే మా నాయన...
మా రాణి నేనైతే గుర్రామే తానై నా భారాలు అన్ని మోసెనే....
పేరుగల్లా... పేరుగల్లా...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...
ఏడూళ్లు చెప్పుకొనేలా ఓ నాయనా... నా పెళ్లి చేసినాడులే మా నాయనా...
కన్నీళ్లు దాచి గుండెలా ఓ నాయనా... అక్షింతలేసినాడులే మా నాయనా...
ఏడూళ్లు చెప్పుకొనేలా ఓ నాయనా... నా పెళ్లి చేసినాడులే మా నాయనా...
కన్నీళ్లు దాచి గుండెలా ఓ నాయనా... అక్షింతలేసినాడులే మా నాయనా...
చిననాడు తన చంక దిగితేనే నేనేడ్చినట్లూ... ఏడ్చుకుంటా నా చేతులిడిసినే... ఏ...ఏ..ఏ...
పేరుగల్లా... పేరుగల్లా...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...
నేనూ లేని ఇంటిలో మా నాయనా... కునుకే లేక కంటిలో...
పండుకుండే గాఢ నిద్రలో మా నాయనా... బాయిగడ్డ మీద మట్టిలో...
కడుపారా కన్నోడు నా కడుపులో పుడితే... పెట్టుకుంటి ఆయన పేరునే... ఏ...ఏ...ఏ...
పేరుగల్లా... మా నాయనా...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుకా
గావురాలే నన్ను చేసీ పెంచెనే ఓ రామసిలుకా...