Airbus Software Issue: అప్పటివరకూ ఎయిర్‌బస్ ఏ319, ఏ320, ఇతర విమానాలు నడపవద్దు- డీజీసీఏ.. పూర్తి జాబితా చూశారా
DGCA alert for Airlines | ఎయిర్ బస్ విమానాలలో టెక్నికల్ ప్రాబ్లమ్ పరిష్కారం అయ్యేంత వరకూ ఏ 319, ఏ 320, ఏ321 విమానాలు నడపొద్దని ఎయిర్‌లైన్స్‌ను డీజీసీఏ కోరింది.

DGCA asks airlines Not to operate Airbus A320 | న్యూఢిల్లీ: ఎయిర్‌బస్ విమానాలలో తలెత్తిన సాంకేతిక సమస్య భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎయిర్‌బస్ విమానాలలో భద్రత, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటంలో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొన్ని ఎయిర్‌బస్ మోడళ్లకు సంబంధించి సేఫ్టీ ఆదేశాలు జారీ చేసింది. డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఎ318, ఎ319, ఎ320, ఎ321 విమానాలతో సహా కొన్ని ఎయిర్‌బస్ మోడళ్లలో తనిఖీలు, మార్పులు తప్పనిసరి. ఎయిర్‌బస్ నుండి వచ్చిన హెచ్చరికతో అప్రమత్తమైన డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది.
పలు విమాన సర్వీసులపై ఆంక్షలు
సుమారు 6,000 యాక్టివ్ ఎ320 విమానాలకు సాఫ్ట్‌వేర్ (అప్‌గ్రేడ్‌లు) అవసరం కావచ్చని ఎయిర్‌బస్ పేర్కొంది. దాంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి భారత ఎయిర్ లైన్స్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. డీజీసీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, తప్పనిసరి మార్పులు, సంబంధిత విమాన ఆదేశాలను పాటించనిదే తాము పేర్కొన్న జాబితాలో ఉన్న విమానాలను ఎవరూ నడపడానికి అనుమతి లేదు.
Directorate General of Civil Aviation (DGCA) issues mandatory safety directive for Airbus A318, A319, A320 & A321 aircraft
— ANI (@ANI) November 29, 2025
The notification reads, "Inspection and/or Modification on the following subject is mandatory. Please make necessary amendment in below mentioned Mandatory… pic.twitter.com/3JqbaqG9ws
ఏఎన్ఐ పోస్ట్ చేసిన నోటిఫికేషన్‌లో ఇలా పేర్కొంది.. "సాఫ్ట్‌వేర్ అప్డేట్, టెక్నికల్ ప్రాబ్లమ్ అంశంపై తనిఖీలు, మార్పు తప్పనిసరి. దయచేసి కింద పేర్కొన్న తప్పనిసరి మార్పుల జాబితాలో అవసరమైన సవరణ చేయాలి. ఏ319, ఏ320, ఏ321 ఎయిర్ బస్ మోడల్ విమానాలలో సోలార్ రేడియేషన్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి.
ప్రభావితమైన ఎయిర్‌బస్ మోడల్స్.. తనిఖీలు, మార్పులు తప్పనిసరి
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎయిర్ బస్‌కు చెందిన ఎ319-111, ఎ319-113, ఎ319-114, ఎ319-131, ఎ319-132, ఎ319-133, ఎ319-151ఎన్, ఎ319-153 ఎన్, ఎ319-171 ఎన్, ఎ319-173 ఎన్, ఎ320-211, ఎ320-212, ఎ320-214, ఎ320-215, ఎ320-216, ఎ320-231, ఎ320-232, ఎ320-233, ఎ320-251 ఎన్, ఎ320-252 ఎన్, ఎ320-253 ఎన్, ఎ320-271 ఎన్, ఎ320-272 ఎన్, ఎ320-273 ఎన్, ఎ321-211, ఎ321-212, ఎ321-213, ఎ321-231, ఎ321-232, ఎ321-251 ఎన్, ఎ321-252 ఎన్, ఎ321-253 ఎన్, ఎ321-251 ఎన్ఎక్స్, ఎ321-252 ఎన్ఎక్స్, ఎ321-253 ఎన్ఎక్స్, ఎ321-271ఎన్, ఎ321-272 ఎన్, ఎ321-271 ఎన్ఎక్స్, ఎ321-272 ఎన్ఎక్స్ ఎయిర్ బస్ మోడళ్లకు డీజీసీఏ ఉత్తర్వులు వర్తిస్తాయి.
ఎయిర్‌బస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హెచ్చరిక
ఇంటెన్స్ సోలార్ రేడియేషన్ కారణంగా ఎ320 మోడల్ విమానాలలో విమాన నియంత్రణలకు సంబంధించి కీలకమైన డేటా పాడైపోయే అవకాశం ఉందని ఎయిర్‌బస్ తెలిపింది. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయాలని, ఆ సమయంలో ఈ మోడల్‌కు చెందిన తమ విమానాలు సేవలు అందించవని ఎయిర్‌బస్ పేర్కొంది. తక్షణ ముందస్తు చర్యగా ఈ ఏఓటీ (Alert Operators Transmission) యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్‌ఏ) నుండి వచ్చే అత్యవసర ఆదేశాలను పాటిస్తామని ఎయిర్‌బస్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
దేశీయ విమానయాన సంస్థలపై ప్రభావం
భారతదేశంలో సుమారు 250 వరకు విమాన సర్వీసులు ప్రభావితం కానున్నాయి. భారతీయ ఆపరేటర్లు సుమారు 560 ఎ320 మోడ్ విమానాలను కలిగి ఉన్నారు. వీటికి కూడా సాఫ్ట్‌వేర్ అప్డేట్, తనిఖీలు అవసరం. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు పలు విమాన సర్వీసులు రద్దు చేశాయి.























