Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన Netflix... ఈ వారమే స్ట్రీమింగ్, ఎప్పుడంటే?
Amaran OTT Release Date Netflix: బ్లాక్ బస్టర్ మూవీ 'అమరన్' ఓటిటి రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ వారమే ఓటీటీలోకి వస్తుంది. ఈ రోజు అమరన్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్.
దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'అమరన్'. ఈ మూవీ వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ ను ఇంకా షేక్ చేస్తోంది. అయితే చాలావరకు సినిమాలన్నీ థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వస్తున్నాయి. 'అమరన్' మూవీ మాత్రం రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతోంది. ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సినిమాను థియేటర్లలో చూసిన మూవీ లవర్స్ ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
దీపావళికి థియేటర్లలో సందడి చేసిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో, మరొకటి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, శివ కార్తికేయన్ అమరన్ మాత్రం రాలేదు. మరి, ఈ సినిమా ఎప్పడు వస్తుంది? అంటే...
డిసెంబర్ 5 నుంచి 'అమరన్' స్ట్రీమింగ్
Amaran OTT Streaming Date: తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద వరదరాజన్ ఉగ్రవాదులతో చేసిన పోరాటంలో అమరుడు అయ్యారు. ఆయన జీవితం ఆధారంగా 'అమరన్' సినిమాను రూపొందించారు. ఇందులో మేజర్ పాత్రలో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటించగా, ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించారు. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ మూవీని నవంబర్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం లేదు. డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్.
Still captivating audiences in theaters, #Amaran will also stream on @NetflixIndia starting December 5th. Witness the journey of a true hero #Amaran5thweek #AmaranMajorSuccess #MajorMukundVaradarajan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
— Raaj Kamal Films International (@RKFI) November 30, 2024
A Film By… pic.twitter.com/x0sOMse08d
మరోవైపు 'అమరన్' మూవీ కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఇప్పటికే ఈ సినిమా తమిళనాట 100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ఇక రిలీజ్ అయిన 19 రోజుల్లోనే ఈ మూవీ దాదాపు రూ. 218.25 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 295 కోట్లు వసూలు చేసి, 300 కోట్లను కొల్లగొట్టింది. సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ ఉండడంతో ఇప్పటిదాకా ఇతర సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఈ మూవీ సందడి తగ్గలేదు. ఇక మరికొన్ని రోజుల్లోనే సినిమా ఓటీటీలోకి రాబోతోంది అనే వార్త తెలిసిన శివకార్తికేయన్, సాయి పల్లవి అభిమానులు ఖుషి అవుతున్నారు.
నిజానికి 'అమరన్' మూవీ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం. కానీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. రిలీజ్ అయ్యాక మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో ఈ మూవీ ఓటిటి రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఓటిటి రిలీజ్ డేట్ విషయంలో ప్లాన్ మార్చుకుంది. లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' మూవీ ఓటిటిలోకి రావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూశాక 'అమరన్' ఓటిటి విడుదల వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. ఆ వార్త ప్రకారం చూసుకుంటే సినిమా డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. మొత్తానికి అనుకున్న దాని కంటే ముందుగానే ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది.