Pujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam
140 కిలోమీటర్లకు పైగా వేగంతో నిప్పులు చెరుగుతూ వచ్చిన బంతులు..నేరుగా శరీరాన్ని తాకి నిలువెల్లా గాయాలు చేస్తున్నా..మొక్కవోని దీక్ష. స్లెడ్జింగ్ కు భయపడలేదు. బాడీ లైన్ బాల్స్ కు బెదిరిపోయి వికెట్లు ఇచ్చేసుకోలేదు. కళ్ల ముందు కుర్రాడు కుమ్మేస్తుంటే...అనుభవాన్ని అడ్డం పెట్టి రాకాసి బంతుల్ని అంతకంటే రాక్షసంగా ఎదుర్కొన్నాడు. వేళ్లు విరిగి రక్తం వస్తున్నా...హెల్మెట్ కు తగిలి గ్రిల్స్ పగులుతున్నా...అణువు అణువు కూడా ఆ బెదరలేదు ఆ శరీరం. టార్గెట్ ఒకటే బంతిని పాతబడేలా చేయటం..కళ్ల ముందు కనిపిస్తున్న మార్గం ఒకటే బాడీని బంతి వేగానికి అడ్డం పడేయటం...బాల్ షైన్ కోల్పోయేలా చేయటం..వందకు రెండొందల శాతం న్యాయం చేశాడు ఆ పోరాట యోధుడు. తనే ఛతేశ్వర్ పుజారా. 2020-21 లో ఆస్ట్రేలియా లో జరిగిన బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ లో సిరీస్ గెలవాలంటే తప్పనిసరిగా గెలిచితీరాల్సిన గబ్బాలో 328 పరుగులు ఛేజ్ చేయాల్సి వచ్చిన నాలుగో ఇన్నింగ్స్ లో పుజారా ఆడిన తీరు ఎప్పుడు చూసినా గూస్ బంప్స్. నాస్టీ, అనదర్ నాస్టీ..వోవ్ దిస్ నాస్టీ అగైన్ అరిచి అరిచి కామేంటేటర్స్ అలిసిపోయి ఉండొచ్చు కానీ దెబ్బలకు మరిగిన ఆ పుజారా బాడీ అలిసిపోలేదు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోదగ్గ ఆ మ్యాచ్ లో పుజారా ఒక్కడే 314 నిమిషాలు క్రీజులో నిలబడ్డాడు. 211 బాల్స్ ఆడాడు..56 పరుగులు మాత్రమే చేశాడు. కానీ మరో వికెట్ పడకుండా గిల్ 91 పరుగులు చేసేలా పుజారా అందించిన సహకారం..బంతి పాతబడితే గిల్ సునాయాసంగా స్ట్రోక్ ప్లే ఆడుకుంటాడని తన శరీరాన్ని అడ్డం పెట్టి బాడీ లైన్ బంతుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న పుజారా తెగువ...ఎప్పుడు బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ అన్నా గుర్తొచ్చేలా చేస్తాయి. చరిత్ర మర్చిపోలేని విజయంలో పుజారా ను భాగం చేశాయి.