YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Andhra Pradesh: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది.

Supreme Court has issued notices on Sunitha petition to cancel Avinash Reddy bail: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. ఈ కేసు విషయంలో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించాడని సునీత తరపు న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదించారు.
ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన రెగ్యులర్‌గా వెళ్లే డాక్టరా అని అని సీజేఐ ప్రశ్నించారు. ఆయన ఖైదీలకు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో డాక్టర్ చైతన్య రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలన్న సునీత తరపు న్యాయవాది కోరారు. సునీత న్యాయవాది వాదనలను సమర్ధించిన సిజెఐ ధర్మాసనం. ఇరువురిని ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది. ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 3కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
Also Read: మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల డబుల్ గేమ్ - టీడీపీతో సఖ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారా ?
అదే సమయంలో వివేకానంద హత్య కేసులో సునీతా రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టును ముగ్గురు ఆశ్రయించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దర్యాప్తు అధికారిపై ప్రైవేటు కంప్లైంట్ ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. హత్య కేసును రూపు మాపాలని ప్రయత్నం చేశారని.. ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారని లూధ్రా వాదించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.
Also Read: TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇది అనేక మలుపులు తిరుగుతోంది. 2024 ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన ప్రచార అస్త్రమైంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు అందరూ బెయిల్ తెచ్చుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

