YSRCP MLCs: మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల డబుల్ గేమ్ - టీడీపీతో సఖ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారా ?
Andhra Pradesh: శాసనమండలిలో వైసీపీ పని తీరు ఆ పార్టీ క్యాడర్ ఆశించిన రీతిలో లేదు. టీడీపీతో వీలైనంత సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానం ఆ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.
YCP Legislative Council: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పదకొండు మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని .. అది ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని వైసీపీ సభాపక్ష నేత జగన్ ప్రకటించారు. దాంతో అసెంబ్లీలో విపక్షం లేకుండా పోయింది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ ఉంది. బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. శాసనసభలో కాకకపోయినా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించిన ఆ పార్టీ క్యాడర్ కు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు.
సోషల్ మీడియా అరెస్టులపై నిలదీయని ఎమ్మెల్సీలు
శాసనమండలిలో వైసీపీకి పూర్తి మజార్టీ ఉంది. టీడీపీకి పది మంది ఎమ్మెల్సీలు ఉంటే.. వైసీపీకి 37 మంది ఉన్నారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందినవారే. ఇలాంటి సమయంలో తమ వాయిస్‌కు మండలిలో గట్టిగా వినిపిస్తారని వైసీపీ శ్రేణులు అనుకున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ప్రభు్తవాన్ని కడిగి పారేస్తారని... ప్రజల దృష్టికి తీసుకెళ్తారని అనుకున్నారు. కానీ బొత్స సత్యనారాయణ అనూహ్యంగా లోకేష్ తల్లిగారిపై అనుచిత వ్యాఖ్యలను చేసిన వారిని ప్రోత్సహించబోమని ప్రకటించారు. అంటే చేసినట్లుగా ఆయన ఒప్పుకున్నట్లు అయింది. దీంతో ఇక డిపెండ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. వైసీపీ సోషల్ మీడియా కార్యక్తలకు చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసి తమపై కేసుల దాడిని ఆపుతారేమోనని అనుకున్నారు. ఇప్పుడు పూర్తిగా హోప్స్ కోల్పోయారు.
Also Read: TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
బిల్లులూ పాసయిపోతున్నాయి !
అసెంబ్లీలో టీడీపీ పలు బిల్లులను ఆమోదిస్తోంది. సహజంగా అవి మండలిలో పాస్ కావాలి. లేకపోతే చట్టం కావు. కానీ బిల్లులు సులువుగా పాస్ అయిపోతున్నాయి. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత కీలకమైన హెల్త్ వర్శిటీ కి వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి బిల్లుల్ని పాస్ చేసేసుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదు. ఇప్పుడు అలాంటి కీలక బిల్లులు కాకపోయినా.. తమ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న సోషల్ మీడియా కేసులకు నిరసనగా బిల్లులని ఆపేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. సాఫ్ గా మండలికి వచ్చి తమ పని చూసుకుని వెళ్లిపోతున్నారు.
Also Read: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
రిస్క్ తీసుకోదల్చుకోని ఎమ్మెల్సీలు
కారణం ఏదైనా ఎమ్మెల్సీలు రిస్క్ తీసుకోదల్చుకోలేదని అర్థం అవుతుంది . ప్రభుత్వంపై ఎగ్రెసివ్ గా వెళ్లాలనుకోవడం లేదు. హైకమాండ్ అలాంటి ఆదేశాలు ఇచ్చిందా లేకపోతే ప్రభుత్వానికి కోపం తెప్పించి తాము ఎందుకు ఇబ్బందులు పడాలని సైలెంట్ గా ఉంటున్నారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బొత్స సత్యనారాయణపై పలు అభియోగాలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ కిషోర్ కుమార్ ను అడ్డం పెట్టుకుని పలు భూదందాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కూడా ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా మండలికి వైసీపీ వెళ్లినా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్లకపోయినా పెద్దగా తేడా లేదని వైసీపీ క్యాడర్ భావిస్తోంది.