అన్వేషించండి

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను

AR Rahman saira Banu Divorce | ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్, సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సైరాబాను లాయర్ ఓ ప్రకటనలో తెలిపారు.

AR Rahman wife saira Banu announces separation | ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ వైవాహిక జీవితంలో టఫ్ ఫేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సైరా బాను తెలిపారు. ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని సైరా బాను చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

లాయర్ ద్వారా ప్రకటన చేయించిన సైరా బాను

29 ఏళ్ల వైవాహిక బంధానికి రెహమాన్, సైరా బాను దంపతులు స్వస్తి పలికారు. గతంలో ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోగా, తాజాగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత రహమాన్ తన భార్య నుంచి విడిపోతున్నారు. వీరి విడాకులకు సంబంధించి సైరా బాను తరఫున లాయర్ వందనా షా అధికారిక ప్రకటన చేశారు. ఇక వీరి దారులు వేరు, రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకున్నారు అని లాయర్ ఓ ప్రకటనలో తెలిపారు.

సైరా బాను కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. రెహమాన్, సైరా బానులు 1995లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్‌ ఉన్నారు. కుమారుడు అమన్ రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6న పుట్టాడు. దాదాపు మూడు దశాబ్దాలు కలిసున్న ఈ జంట విడాకులకు వెళ్లడం రెహమాన్ అభిమానులను బాధిస్తోంది.

ప్రైవసీకి భంగం కలిగించొద్దు

‘ఎన్నో సంవత్సరాల వివాహ బంధానికి రెహమాన్, సైరాబాను స్వస్తి పలికారు. భర్త రెహమాన్ నుంచి విడిపోవాలని సైరాబాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో కలతలు రావడంతో చాలా కష్టమైన నిర్ణయం సైరా బాను తీసుకున్నారు. వారి మధ్య ఎంతో అన్యోన్యత, ప్రేమ ఉన్నప్పటికీ వారి వివాహ బంధంలో ఎంతో ఒత్తిడి, కష్టాలు ఎదురవుతున్నాయి. దాంతో వీరి బంధం కొనసాగించాలని ఈ దంపతులు భావించడం లేదు’ అని సైరా బాను తరఫున లాయర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎంతో బాధతో కూడిన నిర్ణయం సైరా బాను తీసుకున్నారని, తన జీవితంలో కష్టకాలం అని.. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఆమె కోరుతున్నారని తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Embed widget