Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Narayanpet Food Poisoning News:తెలంగాణలో ఫుడ్ పాయిజన్ కేసులు కలకలం రేపుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు రాజకీయంగా కూడా కాక పుట్టిస్తున్నారు. మాగనూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
Narayanpet Food Poisoning News: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవడం రాజకీయ కాక రేపుతోంది. మంగళవారం విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందిని డిశ్చార్జ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఒకసారి ఫుడ్ పాయిజన్ అయిందని మాగనూర్ ఇన్‌చార్జి తహసీల్దార్, ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే భోజనం వడ్డించారు. అయినా ఫుడ్ తిన్న విద్యార్థులు అనారోగ్యంపాలవడం ఆందోళనకు గురి చేస్తోంది.
స్కూల్ సందర్శనకు వెళ్తున్న విద్యార్థి సంఘాలు
మాగనూరు ఇష్యూ రాజకీయంగా ఉద్రిక్తతకు దారి తీస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఫుడ్ పాయిజన్ కావడంతో నేతలు ఆ పాఠశాలను సందర్శించేందుకు పట్టుబడుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటుగా ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు ఆ పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అటుగా ఎవరూ రావద్దని సూచిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్టు - ఖండించిన బీఆర్‌ఎస్ నేతలు
ముందస్తుగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. దీన్ని బీఆర్‌ఎస్ అగ్రనాయకులు తీవ్రంగా ఖండించారు. పాఠశాల సందర్శనకు వెళ్తే ప్రభుత్వానికి భయం ఎందుకని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. అహారం కల్తీ అవుతుందని విద్యార్థులు రోడ్డెక్కితే పట్టించుకోని ప్రభుత్వం తమ నేతలను అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. ప్రతిపక్షాలను అదుపు చేయడం కాదని విద్యార్థులకు మంచి ఫుడ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ నాయకులను విడుదల చేయాలన్నారు.
Also Read: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
కవిత ఆగ్రహం
తప్పులు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారని ముందస్తు అరెస్టు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎంత మందిని అరెస్టు చేసిన ఎన్ని విధాలుగా నిర్బంధించినా పోరాటం ఆగదని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సమైక్య రాష్ట్ర పాలన గుర్తుకు వస్తుందని ట్వీట్ చేశారు.
వరుస ఫుడ్ పాయిజినింగ్ కేసులు
మూడు వారాల కిందట కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని ఓ విద్యార్థిని సోమవారం చనిపోయింది. ఇది మరువక ముందే నారాయణపేట జిల్లాలోని మాగనూరు జడ్పీ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఆందోళన కలిగించింది. అంతే కాకుండా వారం రోజుల వ్యవధిలోనే అదే స్కూల్‌లో మూడోసారి ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వా దాదాపు 30 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే వీళ్లను మాగనూరు, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: తెలంగాణలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్, 21 మంది విద్యార్థులకు అస్వస్థత