ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్.. కాంగ్రెస్, BJPకి ఆ శక్తి లేదు
‘‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మలేదు. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో 3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ హామీలు అమలు చేశామంటూ మహారాష్ట్రలో చెప్పిన అబద్దాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలి. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలహీనమవుతుంది. దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి లేదు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైన సంకీర్ణశకం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ప్రాంతీయ శక్తులను, ప్రాంతీయ పార్టీ నేతలను అణిచివేసే కుట్ర చేస్తే ప్రజలు ఎలా అండగా ఉంటారో ఝార్ఖండ్ ప్రజలు చూపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓటుతో బుద్ధి చెప్తామని ఝార్ఖండ్ ఓటర్లు తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్లకు అభినందనలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదన్నారు’’ అని కేటీఆర్ అన్నారు.
![Keslapur Nagaoba Jathara | ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/eb77fb0ae815ec91502a0c1d9352cac21738082098327310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Chiranjeevi Speech at Experium | ఎక్స్ పీరియమ్ థీమ్ పార్కును ప్రారంభోత్సవంలో చిరంజీవి | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/9a1c91aac5ebad7f3b1977709eaf0fb21738081112692310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![CM Revanth Reddy on Vikarabad Forests | వికారాబాద్ అడవులతో లాభాలు ఏంటో తెలుసా.? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/4991a04fd87deedba94764d91e0f3b001738080864853310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/d7b9117a5eecf7ff92177576eadf4d281737991512632310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Meerpet Psycho Husband Case | మీర్ పేట్ మాధవి హత్య కేసులో కొలిక్కి వస్తున్న దర్యాప్తు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/739629fbf8392a2a571d094da2d35d7f1737990560639310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)