భోజనం చేసే విధానం మీ మనస్తత్వాన్ని చెప్పేస్తుందంటారు పాకశాస్త్ర నిపుణులు.



చేతి వ్రేళ్ళు కలపకుండా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట.



అన్నాన్ని పిసికి పిసికి తినే వారి జీవిత భాగస్వామి తనవల్ల జీవితాంతం బాధపడుతుందట



చేతి వ్రేళ్ళకు తిన్న తిండి అతుక్కుని ఉంటే వాళ్లు దరిద్రులట



ఎవరైతే వేళ్లు మొత్తం నోట్లో పెట్టుకుని జుర్రుకుంటూ తింటారో వారి వద్ద డబ్బు నిలవదు, పిశినారులు కూడా



చేతుల్ని నాకినాకి తినేవారు మిత్రద్రోహి, నమ్మకద్రోహి , మోసం చేసే గుణం కలిగి ఉంటారట.



అరచేయి సహా చుట్టుపక్కల మొత్తం నాకినాకి తినేవారికి పరస్త్రీ వ్యామోహం అధికంగా ఉంటుందట



మొదట కారం కలుపుకుని తినేవారు డబ్బే పరమావధి అన్నట్టు ప్రవర్తిస్తారట. వీళ్లు బంధాలకు విలువ అస్సలు ఇవ్వరు.



పదార్థాలన్నీ ఒకేసారి కలిపేసుకుని తినేవారి ఆలోచనలు కూడా కలగూర గంపలా ఉంటాయట.



ఏ పదార్థం తినాలో తెలియక అదోసారి, ఇదోసారి కలుపుకుని గందరగోళంగా తినేవారికి జీవితంపై స్పష్టత లేదని అర్థం.



ప్రక్క వాళ్ళు ఎలా తింటున్నారో గమనించి తినే వారు అన్నింటా అనుసరించాలనే మనస్తత్వంతో ఉంటారు



శబ్ధం చేయకుండా తినేవారు సుగుణవంతులు, ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు



అరచేతికి ఏమి అంటకుండా తినేవారిపై లక్ష్మి కటాక్షం ఉంటుందట



మొదట స్వీట్ తినేవారు సాత్విక ఆలోచనలతో ఉంటారు



ఈ విషయాల్లో ఎంత వరకూ నిజం అనే వాదన పెట్టుకునే కన్నా తినేవిధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిదంటున్నారు పాకశాస్త్ర నిపుణులు.