టైటిల్ రేసులో సన్నీ... విన్నర్‌గా నిలుస్తాడా? బిగ్ బాస్ టైటిల్ ఎవరు దక్కించుకుంటారనే టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సన్నీకి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సన్నీకి మొదట్లో అంత ఫాలోయింగ్ లేకపోయినా.. బిగ్ బాస్‌లో అతడి ఆట తీరును చూసి అభిమానులు పెరుగుతున్నారు. టైటిల్ రేసులో సన్నీ ఉంటాడనే నమ్మకం పెరుగుతోంది అతని ఫ్యాన్స్‌కు. సన్నీ ఎంత త్వరగా అరుస్తాడో, అంతే త్వరగా కూల్ అయిపోయి ‘మచా’ అంటూ కలిసిపోతాడు. అందరితోనూ స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. పూర్తిస్థాయి విరోధాన్ని పెంచుకోడు. ప్రస్తుతం హౌస్‌లో నవ్వించేది సన్నీనే. టాస్కులు వస్తే మాత్రం ఉగ్రరూపం చూపిస్తాడు. ఫ్రెండ్షిప్‌కి చాలా విలువిస్తాడు. ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. చాలా ఎమోషనల్ పర్సన్. ఇట్టే ఏడ్చేస్తాడు. ఆ ఏడుపులో నిజాయితీ కనిపిస్తుంది. దొంగ ఏడుపులా అనిపించదు. గేమ్ చక్కగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. పక్కవాళ్లు గెలిచినా వారి మీద పడి ఏడ్వడు. సన్నీకి ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. (Image Credit: VJSunny/Instagram)