తెలుగు, తమిళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రాయ్ లక్ష్మి. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా ఆమెకి సరైన సక్సెస్ రాలేదు. అయినప్పటికీ ఆమెకి అవకాశాలు మాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో బుక్ చదువుతూ కనిపించింది. రెడ్ కలర్ స్విమ్ సూట్ లో రాయ్ లక్ష్మి హీట్ పెంచేస్తోంది..