మల్టీ టాలెంటెడ్, యూట్యూబర్, రేడియో జాకీ, వాగుడుకాయ, సింగర్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్.. ఇన్ని టాలెంట్స్ తో ఆకట్టుకుంటోంది కాజల్.
బిగ్ బాస్ సీజన్ 5 హౌజ్ లో 17 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కాజల్ బుల్లితెర అభిమానుల మెప్పు పొందుతూ హౌజ్ లో ముందుకు సాగుతోంది.
ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా పరిచయమైన ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఆర్జే కాజల్ విజయవాడ లోనే పుట్టి పెరిగింది. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ కాగా అమ్మ హౌస్ వైఫ్. వీరు ముగ్గురు అమ్మాయిలు..కాజల్ చిన్నమ్మాయి.
విజయ్ శీలంశెట్టిని ప్రేమ వివాహం చేసుకున్న కాజల్ కి ఓ కుమార్తె. బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కాజల్ కు రేడియో జాకీ గా అవకాశం రావడంతో వెంటనే ఆ ఆఫర్ అందిపుచ్చుకుంది.
కేవలం ఆర్జే గానే పరిమితం కాకుండా.. పలు ఈవెంట్స్ ను హోస్ట్ చేయడంతో పాపులర్ అయింది కాజల్.
2009 లో “నిన్ను కలిసాక” సినిమా లో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. సుమారు 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పింది.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా మంచు మనోజ్ ,తాప్సీ నటించిన “ఝుమ్మందినాదం” ఓ ఫ్రేమ్ లో కనిపించింది కాజల్.
యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులార్ అయిన కాజల్ హిందీ బిగ్ బాస్ చూస్తూ ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంది. ఎట్టకేలకు ఛాన్స్ రావడంతో సద్వినియోగం చేసుకుంది.