Nepal Youth Dancing After Gen Z protest | పార్లమెంటు దగ్ధం ఘటనలో వైరల్ అవుతున్న నేపాల్ కుర్రాడు | ABP Desam
ఈ కుర్రాడిని చూడండి. పార్లమెంటును తగలబెట్టేసి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. వైరల్ అవ్వాలనేదే ఇతని ఇంటెన్షన్. సోషల్ మీడియాను బ్యాన్ చేసినా వైరల్ అవుతా చూడండి అన్న తన నిరసనను ఇలా తెలియచేశాడని స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది. రెండు రోజులుగా నేపాల్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో అక్కడి యువతలోని ఆగ్రహావేశాలు బాహ్యప్రపంచానికి తెలిశాయి. నేతల అవినీతి, వంశపారంపర్య అధికారాలు, నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో సోషల్ మీడియా బ్యాన్ చేయటంతో రోడ్లపైకి వచ్చిన యువతీ యువకులు జెన్ జీ ఉద్యమం పేరుతో హింసకు దిగారు. ఎక్కడిక్కడ వాహనాలు దగ్ధం చేస్తూ నేపాల్ పార్లమెంటు, ప్రధాని నివాసాలపైనా దాడికి దిగి పెట్రో బాంబులు విసిరారు. ఫలితంగా నేపాల్ లో ప్రభుత్వం కుప్పకూలగా..ప్రధాని దేశం విడిచి పారిపోయారు. అయితే ఇప్పుడు ఈ డ్యాన్సింగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వైపు పార్లమెంటు తగలబడి పోతుంటే మరో వైపు జెన్ జెడ్ కిడ్ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





















