News
News
వీడియోలు ఆటలు
X

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

Weekly Rasi Phalalu (27 March-02 April): ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope (27 March-02 April):  శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మొదటివారం ఈ ఆరు రాశులవారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

మేష రాశి 

మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. వారం ప్రారంభంలో బిజీగా ఉంటారు. ఉద్యోగులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. దానిని ఎదుర్కొనేందుకు ఎక్కువ సమయం కష్టపడాల్సిందే. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారులు కఠినమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది..నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమవ్యవహార్లో తొందరపాటుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి జీవిత భాగస్వామి అవసరాలను విస్మరించకుండా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలనిస్తుంది.

వృషభ రాశి 

వృషభ రాశి వారికి కూడా ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారంలో చాలా ఒడిదుడుకులు చూస్తారు. నిరుద్యోగులు కెరీర్ కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తే మాత్రం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే. నిర్మాణాలకు సంబంధించిన విషయాల్లో కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. వారం మధ్యలో ప్రయాణాలు చేయాల్సి ఉండొచ్చు...ఆ సమయంలో ఆరోగ్యం, వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యం వహించవద్దు.విద్యార్థులు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారు. స్నేహితుల సహాయంలో మీ ప్రేమ బంధంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి కానీ..మీ ఇద్దరి మధ్యా పరస్పర నమ్మకం రావడానికి సమయం పడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళ ఉంటుంది. శివారాధన చేస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

సింహ రాశి

ఈ రాశివారు ఈ వారం ఆరోగ్యం, సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారం ప్రారంభంలో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం క్షీణించడం మీ పనిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చేతిలో ఉన్న పెద్ద అవకాశాన్ని కోల్పోవడంతో ఇబ్బంది ఉండవచ్చు. వారం ద్వితీయార్ధంలో అకస్మాత్తుగా భూనిర్మాణానికి సంబంధించిన పెద్ద సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే చిన్న పొరపాటు మీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ బంధంలో ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. మీ ప్రేమ భాగస్వామి వ్యక్తిగత జీవితంలో మితిమీరిన జోక్యం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది.  వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే జీవిత భాగస్వామి  భావాలను గౌరవించండి. నారాయణ కవచం పఠించండి..

తులా రాశి 

ఈ రాశివారికి ఈ వారం ప్రారంభంలో కొంచెం బిజీగా ఉంటారు. అనవసర వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త.  ఏదైనా విషయాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదం మిమ్మల్ని  క్షోభకుగురిచేస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త... మాట తూలకుండా చూసుకోండి. ఉద్యోగులు కార్యాలయంలో...చిన్న చిన్న విషయాలకు స్పందించడం కంటే వాటిని విస్మరించడం మంచిది. వారం ద్వితీయార్ధంలో వృత్తి-వ్యాపారానికి సంబంధించి ప్రయాణించవలసి ఉంటుంది. మీ మనసులో ప్రేమను ఎప్పుడంటే అప్పుడు కాదు.. సమయం చూసుకుని వ్యక్తపరచండి. ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

మకర రాశి 

ఈ రాశివారు ఈ వారం తమ బాధ్యతలు నెరవేర్చేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వారం ప్రారంభంలో  ఇంటి మరమ్మతుల పనుల్లో బిజీగా ఉంటారు. అకాస్మాత్తుగా వచ్చే కొన్ని ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం సరిగా లేకపోవడం కూడా మీకు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది...మీ సీనియర్లు, జూనియర్లతో వాదన పెట్టుకోపోవడం మంచిది. ఈ వారం ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయం గురించి అపార్ధం మీ ప్రేమ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పెరగకుండా చూసుకోవడం మంచిది. సుందరకాండ పఠిస్తే మీకు మంచి జరుగుతుంది.

కుంభ రాశి

ఈ రాశివారు ఈవారం సోమరితనానికి, అహంకారానికి దూరంగా ఉండడం మంచిది. పనులను వాయిదావేయవద్దు...ఎప్పటి పని అప్పుడు పూర్తిచేసుకోవడం మంచిది..లేదంటే తీవ్రంగా నష్టపోతారు. వివాదాలు ముదరకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది.  వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పథకం లేదా వ్యాపారంలో డబ్బును చాలా ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టాలి.   వారం ద్వితీయార్ధంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ప్రేమ బంధంలో జాగ్రత్తగా ముందుకు సాగండి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి జీవిత భాగస్వామి అవసరాలను విస్మరించవద్దు. హనుమాన్ చాలీశా పఠించండి...

Published at : 25 Mar 2023 07:22 PM (IST) Tags: aries weekly horoscope Weekly Horoscope 27 March to 02 April astrology predictions in telugu 27 march to 02 april rashifalalu weekly predictions zodiac signs in telugu Every Zodiac Sign's Weekly horoscope

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

టాప్ స్టోరీస్

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?