News
News
వీడియోలు ఆటలు
X

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Weekly Rasi Phalalu (27 March-02 April): ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope 27 March-02 April:  శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మొదటివారం ఈ ఆరు రాశులవారికి అద్భుతమైన ఫలితాలున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

మిథున రాశి 

మిథున రాశివారికి ఈ వారం శుభప్రదంగా ఉంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. అధికారుల మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలుంటే ఓ కొలిక్కి వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్త వింటారు. నిరుద్యోగులు ఉద్యోగంలో కుదురుకుంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. మీరు సాధించిన విజయాలను చూసి అసూయపడే వారు మీ కార్యాలయంలో ఉన్నారు..వారితో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు..ఆర్థిక వ్యవహారలను ముందే క్లియర్ చేసుకుని ముందుకు సాగడం మంచిది. నూతన పెట్టుబడి పెట్టేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వినాయకుడి చాలీశా పఠించండి మీకు మంచి జరుగుతుంది. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఒక పెద్ద విజయం అందుకుంటారు...ఆ ఉత్సాహంలో పడి మిగిలిన విషయాలను పక్కనపెట్టకుండా చూసుకోవాలి. రిస్క్ ఉన్న వ్యవహారాల్లో డబ్బు పెట్టుబడులు పెట్టొద్దు...లేదంటే భవిష్యత్ లో నష్టపోతారు. ఉద్యోగులు ఈ వారం శుభఫలితాలు అందుకుంటారు. కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది..పదోన్నతి పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో లాభాలుంటాయి. కుటుంబానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలకు తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. విదేశాల్లో కెరీర్ లేదా వ్యాపారం గురించి ఆలోచిస్తుంటే..దానికి రూట్ క్లియర్ అవుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు మినహా ఆరోగ్యం బాగానే ఉంటుంది.  శివ మంత్రాన్ని పఠించండి..

Also Read: ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

కన్యా రాశి 

కన్యా రాశివారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. మీరుగతంలో చేసిన కొన్ని పనులకు ఈ వారం ప్రారంభంలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగులు పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు..మీ బాధ్యత పెరుగుతుంది. వ్యాపారులకు కూడా అనుకూల సమయం. మార్కెట్ లో ఉన్న బూమ్ ను మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలన్నమీ కోరిక నెరవేరుతుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మారాలని భావించే వారికి వారాంతంలో పెద్ద ప్రదేశం నుంచి ఆఫర్ లభిస్తుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన మీకు మంచి చేస్తుంది

వృశ్చిక రాశి 

ఈ రాశివారికి వారం ప్రారంభం ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ వారాంతంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి-వ్యాపారాలకు సంబంధించి మంచి సమాచారం అందుతుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి..ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. భూ నిర్మాణానికి సంబంధించిన వివాదాలను సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో పరిష్కరిస్తారు. వారం ద్వితీయార్ధంలో విద్యార్థుల మనస్సు చదువు పట్ల కలత చెందుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు వారి ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. మూడో వ్యక్తి జోక్యం కారణంగా మీ బంధం దెబ్బతినే ప్రమాదం ఉంది జాగ్రత్త. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం మంచిది.దుర్గాదేవి ఆరాధన మీకు శుభప్రదం.

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!

ధనుస్సు రాశి 

ఈ రాశివారు ఈవారం తమ సమయాన్ని, శక్తిని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఊహించినదానికన్నా ఎక్కువ ప్రయోజనం, విజయాలు పొందుతారు. వారం ప్రారంభంలో వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సమయంలో, మీరు సమర్థవంతమైన వ్యక్తులతో సంబంధాన్ని పెంచుకుంటారు..భవిష్యత్తులో వారి సహాయంతో ప్రయోజనాన్నిపొందేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి మహిళలు పెద్ద విజయం సాధిస్తారు. పని ప్రదేశంలో, కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి సమయం ఇదే. వారం ద్వితీయార్థంలో ఆరోగ్యం జాగ్రత్త. విష్ణు సహస్రనామ పారాయణ మీకు మంచి ఫలితాలనిస్తుంది. 

మీన రాశి 

ఈ రాశివారు కష్టపడితేనే అందుకు తగిన ఫలితం అందుకోగలుగుతారు. ఉద్యోగులు పని విషయంలో రాజీ పడొద్దు. ఈ వారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారికి ఇబ్బంది పెరుగుతుంది. వ్యాపారులకు ఈ వారం ఆశించిన ఫలితాలు పొందుతారు. మార్కెట్లో ఉన్న బూమ్ ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో మీ బంధం బావుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించండి.

Published at : 25 Mar 2023 07:50 PM (IST) Tags: aries weekly horoscope Weekly Horoscope 27 March to 02 April astrology predictions in telugu 27 march to 02 april rashifalalu weekly predictions zodiac signs in telugu Every Zodiac Sign's Weekly horoscope

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

టాప్ స్టోరీస్

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ