శోభకృత్ నామసంవత్సరంలో ఈ రాశులవారు బాగా సంపాదిస్తారు



వృషభ రాశి (ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృషభరాశివారికి ఆదాయం కన్నా ఖర్చులు తక్కువే ఉన్నాయి. గురుడు 12 వ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల బలం వల్ల అన్నింటా యోగ్యమైన ఫలితాలు పొందుతారు. శని, రాహువు మంచి స్థానంలో ఉండడం వల్ల అన్నింటా ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.ఆదాయం బావుంటుంది,



కర్కాటక రాశి ( ఆదాయం : 11 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4)
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో కర్కాటక రాశివారికి ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే ఎంతో కొంత జాగ్రత్త చేయడంలో ఈ ఏడాది సక్సెస్ అవుతారు. పైగా అష్టమ శని ఉన్నప్పటికీ సంపదకు కారకుడైన గురుడు 10వ స్థానంలో సంచరిస్తున్నందున ఆర్థికంగా పుంజుకుంటారు కానీ మానసిక బాధలుంటాయి.



సింహ రాశి (ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం:1 అవమానం : 7)
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో సింహరాశివారి ఆదాయం ఎక్కడో ఉన్న..ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. సంపదకు కారకుడైన గురుడు బలంగా ఉండడం వల్ల భారీగా సంపాదిస్తారు..ఖర్చులు తక్కువే పెడతారు. కానీ ఏడాది ద్వితీయార్థంలో రాహువు అష్టమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులుంటాయి.



తులా రాశి (ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం:7 అవమానం : 7)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో తులారాశివారి ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. కష్టపడి సంపాదిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప తులా రాశివారికి యోగకాలమనే చెప్పాలి.



మకర రాశి ( ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6)
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మకర రాశివారు పదకొండు వంతులు సంపాదిస్తే అందులో ఐదొంతులు మాత్రమే ఖర్చు చేస్తారు... అంటే.. సగానికి సగం దాచేస్తారు లేదంటే స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. గురుబలం బావున్నందున ఆదాయానికి అస్సలు లోటుండదు. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు.



కుంభ రాశి (ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశివారు కూడా సంపాదించిన దాంట్లో సగం మాత్రమే ఖర్చుచేస్తారు. వీరికి కూడా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ గురుబలం ఉపశమనం ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటా-బయటా అవమానాలు తప్పవు, కష్టపడి సంపాదిస్తారు...



నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు.



మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం



Images Credit: Pixabay