ఈ రాశులవారికి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది



మిథున రాశి (ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4)
మిథునరాశివారికి శని ప్రభావం తొలగిపోయి గురుడు బలంగా ఉన్నందున ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆర్థికంగా పుంజుకుంటారు, స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఆస్తుల కొనుగోలు కూడా ప్రస్తుతానికి వ్యయమే కదా..అలా మంచి మార్గంలో పెరిగే ఖర్చులన్నమాట.



కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
కన్యారాశివారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. శని సంచారం శుభాన్నివ్వడంతో ఆర్థికంగా బాగానే ఉంటుంది..కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది కానీ...అష్టమంలో ఉన్న గురుడు సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఓ దశలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.



ధనస్సు రాశి (ఆదాయం : 8 వ్యయం :11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3)
శని,దేవతల గురువు బృహస్పతి, శని ఇద్దరూ శుభ స్థానంలోనే ఉన్నారు. ఈ ఫలితంగా గతంలో పడిన బాధలు, ఇబ్బందులు, చికాకులు తొలగిపోయి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందుతారు. ఆస్తులు వృద్ధి చేస్తే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ అవుతున్నట్టే అని కూడా గుర్తుంచుకోవాలి.



మీన రాశి (ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం :1 అవమానం : 2)
మీన రాశివారికి ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతోంది. గురుబలం ఉన్నందున ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు మాత్రం అంతకుమించి ఉంటాయి. అనుకున్న పనులు ఏవీ పూర్తికావు..ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు



మేష రాశి (ఆదాయం: 5 , వ్యయం:5 , రాజపూజ్యం:3 , అవమానం:1)
మేష రాశివారికి ఈ ఏడాది ఆదాయం-వ్యయం రెండూ సమానంగా ఉన్నాయి. ఈ ఏడాది గ్రహస్థితి పరంగా చూస్తే.. గురుడు, శని రెండు గ్రహాలూ శుభస్థానంలోనే ఉన్నాయి. జన్మంలో రాహుకేతువుల ప్రభావం వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి కానీ పూర్తవుతాయి. ఓవరాల్ గా వీరి గ్రహస్థితిబావుంది.



వృశ్చిక రాశి (ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3)
వృశ్చిక రాశివారికి కూడా ఆదాయం-వ్యయం సమానంగా ఉంటాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే వృశ్చికరాశివారికి ఈ ఏడాది బాగానే ఉంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. గురు బలం మీకు అన్నింటా అనుకూల ఫలితాలనిస్తుంది.



నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు.



మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం