శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వార్షిక ఫలితాలు



మేషరాశివారికి... భాగ్య, వ్యయాధిపతి అయిన గురువు జన్మరాశిలో సంచరిస్తున్నందున గతంలో కన్నా శుభఫలితాలే. శని పదకొండో స్థానంలో ఉండడం కొంత ఉపశనమం. జన్మంలో రాహుకేతువుల ప్రభావం వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.



వృషభరాశివారికి ఈ ఉగాది నుంచి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురుడు 12 వ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల బలం వల్ల అన్నింటా యోగ్యమైన ఫలితాలు పొందుతారు. శని, రాహువు మంచి స్థానంలో ఉండడం వల్ల అన్నింటా ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.



మిథున రాశివారికి సప్తమ రాజ్యాధిపతి, ధనం, సంపత్తుకారకుడైన గురువు శుభసంచారం చేస్తున్నాడు. అష్టమ శని తొలగిపోయినందున అన్ని రంగాల వారికి శుభసమయం. ఆర్థికంగా పుంజుకుంటారు, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. శని, రాహు బలం కలిసొస్తుంది



కర్కాటక రాశివారికి.. సంపదకు కారకుడైన గురుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహుకేతువులు శుభ స్థానంలో ఉన్నారు. శని అష్టమంలో ఉన్నందుకు మిశ్రమ ఫలితాలున్నాయి. గురుబలం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది...ఇంటా-బయటా ఇబ్బందులున్నప్పటికీ ధైర్యంగా దూసుకెళతారు



శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో సింహరాశివారికి గురుబలం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో రాహువు అష్టమంలో ఉండడం వల్ల ఈ ప్రభావంతో మిశ్రమ ఫలితాలుంటాయి.



కన్యారాశివారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. శని సంచారం శుభాన్నిస్తాడు...ఆర్థికంగా బావుంటుంది , అభివృద్ధి వైపు అడుగేస్తారు.. అయితే అష్టమంలో ఉన్న గురుడు సంచారం ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రాహువు సంచారం వల్ల లోలోపల భయం, ఆందోళన, చికాకులు తప్పవు



శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప తులా రాశివారికి యోగకాలమనే చెప్పాలి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. స్వశక్తితో రాణిస్తారు.



వృశ్చిక రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అనుకూల స్థానంలో ఉన్నందున మీలో అంతర్గతంగా ఉన్న ఆశలు నెరవేరుతాయి, ఆదాయం, గౌరవం పెరుగుతుంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది.



ధనస్సు రాశివారికి మహోన్నత యోగం ఉంది. బృహస్పతి, శని ఇద్దరూ శుభ స్థానంలోనే ఉన్నారు. ఈ ఫలితంగా గతంలో పడిన బాధలు, ఇబ్బందులు, చికాకులు తొలగిపోయి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందుతారు. ద్వితీయార్థంలోఅర్దాష్టమ రాహువు వలన మానసిక ఆందోళనలుంటాయి.



మకర రాశివారికి బాగానే ఉంది. గురుడు, రాహువు బలీయంగా ఉన్నందున.. ఆదాయానికి లోటుంటదు. గౌరవ మర్యాదలు పొందుతారు. ఏలినాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం అంతగా ఉండదు. రాహువు ప్రభావం, ఏలినాటి శని ప్రభావం ఉన్నందున కొన్ని సూతకాలు తప్పవు.



కుంభ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అనుకున్నపనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. అయితే గురుబలం ఉండడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది



శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మీన రాశివారికి సంపదకు కారణమైన గురుడు బలంగానే ఉన్నాడు కానీ ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అక్టోబరు వరకూ అష్టమంలో ఉన్న కేతువు ప్రభావం అధికంగానే ఉంటుంది.



Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.. Images Credit: Pixabay