శ్రీ శోభకృత్ నామ సంవత్సర కుంభ రాశి వార్షిక ఫలితాలు



ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6



శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అనుకున్నపనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.



ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటా-బయటా అవమానాలు తప్పవు. మానసిక బాధలు ఎదుర్కొంటారు, వివాహితుల జీవితంలో ఇబ్బందులు - చీటికి మాటికీ తగాదాలు - భార్య భర్త మధ్య సరైన అవగాహన ఉండదు



ఆప్త బంధువు మరణం కలచివేస్తుంది, కర్మలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి . మాటపట్టింపులు, తమకన్నా చిన్నవారి వల్ల మాటలు పడతారు
ఎంత ప్రతిభ ఉన్నా మాటలుపడక తప్పదు



ప్రైవేట్ సంస్థల్లో దాచుకున్న డబ్బులు నష్టపోతారు, మానసిక ఆందోళన పెరుగుతుంది..ధైర్యం తగ్గుతుంది. వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి, అవివాహితులకు ఈ ఏడాది కూడా నిరాశే మిగులుతుంది



కుంభ రాశి ఉద్యోగులకు శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో గడ్డుకాలమనే చెప్పాలి. జన్మంలో శని ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కష్టపడి పనిచేసినా మాటలు పడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ప్రభుత్వ ఉద్యోగులకు సుదూర ప్రాంతాలకు బదిలీలు తప్పవు.



ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలం వల్ల విద్యార్థులకు ఈ ఏడాది బాగానే ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది కానీ ఇతర వ్యాపకాలపై కూడా దృష్టి మరలుతుంది. అందుకే కష్టపడి చదివితేనే మంచి ఫలితం అంఅందుకోగలుగుతారు..అదృష్టం అనేమాటను పక్కన పెట్టేయడమే.



కుంభ రాశి వ్యాపారులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలున్నాయి. గురుబలం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, సరుకులు నిల్వచేసే వ్యాపారులకు లాభాలొస్తాయి. భాగస్వామ్య వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కలసిరాదు.



కుంభ రాశి కళాకారులకు ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలం వల్ల మంచి ఫలితాలే పొందుతారు. కొన్ని విషయాలలో మీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మంచి అవకాశాలే పొందుతారు



కుంభ రాశికి చెందిన రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం గడ్డుకాలమనే చెప్పాలి. ప్రజల్లో మీపై విశ్వాసం కోల్పోతారు. అధిష్ఠాన వర్గంలోనూ మీపై సదభిప్రాయం ఉండదు. మీపై వ్యతిరేకత పెరుగుతుంది.. నమ్మినవారే దగా చేస్తారు. మీతో ఉన్నవారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు జాగ్రత్త...



ఈ రాశి వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే లాభిస్తుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందులు తప్పవు. పండ్ల తోటలు నమ్ముకున్నవారికి నష్టాలు తప్పవు



Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.. Images Credit: Pixabay