శ్రీ శోభకృత్ నామ సంవత్సర మకర రాశి వార్షిక ఫలితాలు



ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6



శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మకర రాశివారికి బాగానే ఉంది. గురుడు, రాహువు బలీయంగా ఉన్నందున.. ముఖ్యంగా సంపత్తుకి కారకుడైన గురుబలం బావున్నందున ఆదాయానికి లోటుంటదు.



ఏలినాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం అంతగా ఉండదు. రాహువు ప్రభావం, ఏలినాటి శని ప్రభావం ఉన్నందున కొన్ని సూతకాలు తప్పవు..ఆప్తబంధువులు మరణం మిమ్మల్ని బాధిస్తుంది.



ఈ ఏడాది గురుబలం వల్ల సాంఘికంగా, ఆర్థికంగా లాభపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు



దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. శత్రువుల సంఖ్య తగ్గుతుంది కానీ వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారు విజయం సాధిస్తారు



దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఈ రాశి అవివాహితులకు పెళ్లిజరుగుతుంది



మకర రాశి ఉద్యోగులకు అనుకూల సమయం. శ్రమకు తగిన గుర్తింపు, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఎలినాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం తక్కువగా ఉండడం వల్ల అధికారులనుంచి వేధింపులు ఉండవు. ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి.



ఈ రాశి విద్యార్థులకు గురుబలం బావుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించుకుని చదువుపై శ్రద్ధ పెడతారు. పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు సాధిస్తారు



వ్యాపారులకు ఆశించిన లాభాలొస్తాయి. హోల్ సేల్, రీటైల్ రంగంలో ఉన్నవారి ఆదాయం బావుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొస్తుంది.



కళారంగంలో ఉన్నవారికి ఈ ఏడాది మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అవార్డులు , రివార్డులు పొందుతారు.



మకర రాశి రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బాగా కలిసొస్తుంది. గతేడాదికన్నా అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ప్రజల్లో ఫాలోయింగ్ పెరుగుతుంది..అధిష్టానం నుంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు కూడా మీకు సహాయపడతారు



ఈ రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. రెండు పంటలు లాభిస్తాయి. అనుకున్నదానికన్నా ఎక్కువ ఆదాయం లభిస్తుంది. వాణిజ్య పంటలు, ప్రౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం...



Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. Images Credit: Pixabay