శ్రీ శోభకృత్ నామ సంవత్సర ధనస్సు రాశి వార్షిక ఫలితాలు!



మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం : 8 వ్యయం :11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3



ధనస్సు రాశివారికి మహోన్నత యోగం ఉంది. బృహస్పతి, శని ఇద్దరూ శుభ స్థానంలోనే ఉన్నారు. ఈ ఫలితంగా గతంలో పడిన బాధలు, ఇబ్బందులు, చికాకులు తొలగిపోతాయి. ద్వితీయార్థంలో మాత్రం అర్దష్టమ రాహువు వలన మానసిక ఆందోళనలుంటాయి.



మీరున్నరంగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు..అధికారుల అనుగ్రహం సదా మీపై ఉంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది, ఎంతటివారినినా మీవైపు తిప్పుకోగల నేర్పు మీ సొంతం



ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి..పెళ్లి దిశగా అడుగేయాలి అనుకుంటే ఈ ఏడాది మంచి సమయం . విందు,వినోదాల్లో ఉత్సాహంగా ఉంటారు



నూతనంగా ప్రారంభించే పనులు మీకు కలిసొస్తాయి..గతంలో ఉన్న శత్రువులు మిత్రులుగా మారుతారు. విలువైన ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.. ఖర్చులు భారీగా ఉంటాయి



ధనస్సు రాశి ఉద్యోగులకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. మీ మాటకు తిరుగులేదు. ఎంతటి అధికారులైనా మీ మాట మీరలేనంత పవర్ మీ సొంతం. ప్రమోషన్ తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.



వ్యాపారులకు ఈ ఏడాది అద్భుతమైన కాలం. అన్ని రకాల వ్యాపారులకు కలిసొస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొస్తుంది.



ఈ రాశి విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలను వదిలిపెట్టి చదువుపై శ్రద్ధ పెడతారు. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు.



ఈ రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు లాభిస్తాయి. కౌలుదార్లకు కూడా శుభసమయం.చేపలు, రొయ్యల చెరువులు నిర్వహించేవారు లాభాలు పొందుతారు. పౌల్ట్రీ రంగం బావుంటుంది. వాణిజ్య పంటలు, కాయగూరలు పండించేవారికి మంచి లాభాలొస్తాయి.



రాజకీయ నాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం సువర్ణావకాశం. ప్రజాభిమానం విశేషంగా పొందుతారు. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం మీదే అవుతుంది. శత్రువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి



శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కళారంగం వారికి అనుకూల ఫలితాలున్నాయి. ప్రజాకర్షణ పెరుగుతుంది. టీవీ రంగంవారికి మంచి ఫలితాలున్నాయి.



Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

శ్రీ శోభకృత్ నామ సంవత్సర వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు

View next story