శ్రీ శోభకృత్ నామ సంవత్సర వృశ్చిక రాశి వార్షిక ఫలితాలువిశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3వృశ్చిక రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. సంపత్తు కారకుడైనా గురుడు అనుకూల స్థానంలో ఉన్నందున మీలో అంతర్గతంగా ఉన్న ఆశలు నెరవేరుతాయి, ఆదాయం,గౌరవం పెరుగుతుంది.అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహార్లో చిక్కుకున్న వారు ఈ ఏడాది వాటినుంచి బయటపడతారు విజయం సాధిస్తారుఈ రాశివారు ఈ ఏడాది దూర ప్రాంతం ప్రయాణిస్తారు..పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల్లో, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయిఆర్థికపరంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శత్రుబాధలు అంతరిస్తాయి..స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ ఏడాది కొంత ఉపశమనం లభిస్తుందివృశ్చిక రాశి ఉద్యోగులకు శ్రీ శోభకృత్ నామసంవత్సరం అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది, ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు.వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ ఏడాది గురుబలం బావుండడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా చదువులో దూసుకుపోతారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.వ్యాపారులకు ఈ ఏడాది మంచి ఫలితాలుంటాయి. పెట్టుబడులన్నీ లాభాలు తెచ్చిపెడతాయి. హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు లాభాలు పొందుతారు. షేర్ మార్కెట్,రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినవారు రెట్టింపు లాభాలు ఆర్జిస్తారు.రాజకీయ నాయకులకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అధిష్టాన వర్గం నుంచి ప్రశసంలుంటాయి. ప్రజల సమస్యలు పరిష్కరించే మంచి నాయకుడిగా పేరు సంపాదిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మీ ముందు మోకరిల్లుతారు.వృశ్చి రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు లాభాలొస్తాయి. వాణిజ్య పంటలు, చేపల చెరువుల వారికి అద్భుతమైన లాభాలొస్తాయి. కౌలుదార్లకు కూడా ఈ ఏడాది బాగానే ఉంటుందిNote: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

ఈ రాశివారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త

View next story