శ్రీ శోభకృత్ నామ సంవత్సర (2023 - 2024) సింహరాశి ఫలితాలు ( మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం )
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం:1 అవమానం : 7



శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో సింహరాశివారికి గురుబలం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో రాహువు అష్టమంలో ఉండడం వల్ల ఈ ప్రభావంతో మిశ్రమ ఫలితాలుంటాయి.



ఆర్థిక పరిస్థితి బావుంటుంది..రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది కానీ అవి చేతిలో నిలవవు. భార్య భర్త మధ్య అన్యోన్యత బాగున్నప్పటికీ శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలు వెంటాడతాయి



ఆరోగ్యం పరంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు...ముఖ్యంగా గుండెజబ్బులు, ఆస్మా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సగంలో ఆగిపోతాయి. ఇతరులను నమ్మి మోసపోతారు, తోటివారితో అభిప్రాయ బేధాలుంటాయి



నిద్రలేమి బాధలు, దుష్ట కలలు వెంటాడతాయి, ఆప్తబంధువుల్లో ఒకరి మరణం మిమ్మల్ని బాధపెడుతుంది. ప్రశాంతత ఉండదు.. ప్రతి పనీ అతి కష్టంమీద పూర్తవుతుంది



సింహ రాశి ఉద్యోగులకు శోభకృత్ నామ సంవత్సరంలో అక్టోబరు వరకూ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి...ఆ తర్వాత నుంచి చిన్న చిన్న ఇబ్బందులు మొదలవుతాయి. అధికారుల వల్ల వేధింపులు, ఎంత పనిచేసినా కష్టానికి తగిన గుర్తింపు లభించదు.



వ్యాపారులకు
శోభకృత్ నామ సంవత్సరం వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి బావుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు నష్టపోతారు. నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు లాభపడతారు.



విద్యార్థులకు
సింహ రాశి విద్యార్థులకు ఈ ఏడాది గురుబలం బావుండడం వల్ల చదువు పరంగా బావుంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలవైపు ఆకర్షితులు కాకుండా..చదువుపై శ్రద్ధ పెడతారు. వివిధ కోర్సులకు ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు



వ్యవసాయదారులు
వ్యవసాయదారులకు మొదటి పంట లాభాలొస్తాయి కానీ రెండో పంట దిగుబడి తగ్గుతుంది. కౌలుదారులకు నష్టమే. నర్సరీ వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది



రాజకీయ నాయకులకు
సింహ రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రజల్లో, అధిష్టానం దృష్టిలో మంచి పేరు ఉన్నప్పటికీ పదవుల్లో వెలిగే అవకాశాలు తక్కువే ఉన్నాయి. విజేతలుగా నిలవలేరు. .డబ్బులు ఖర్చు అయినా అందుకు తగిన ఫలితం దక్కడం కష్టమే



కళారంగం వారికి
కళారంగం వారికి మొదటి ఆరు నెలలు బాగానే ఉన్నప్పటికీ ఏడాది ద్వితీయార్థం ఇబ్బందులు తప్పవు. కష్టానికి తగిన ఫలితం లేకపోగా.. నూతన అవకాశాలు కూడా రావడం కష్టం అవుతుంది



నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
Images Credit: Pixabay