ABP Desam


తెలుగు సంవత్సరాది ఉగాదిరోజు రాశిఫలాలు
(22-03-2023)


ABP Desam


మేష రాశి
ఈ రాశివారికి కార్యాలయంలో పనిభారం అధికంగా ఉంటుంది. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. అనుకోకుండా ప్రయాణం చేయవలసి రావొచ్చు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగులు శుభవార్త వింటారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.


ABP Desam


వృషభ రాశి
ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన విషయాలకు ఈ రోజు మంచిరోజు. ఈ రాశి ఉద్యోగులు పనివిషయంలో శ్రద్ధగా ఉంటారు. వివిదాస్పద విషయాల్లో చిక్కుకున్నప్పటికీ దాన్నుంచి బయటపడతారు. స్నేహితుల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి.


ABP Desam


మిథున రాశి
ఈ రాశివారికి పదవి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇతరుల నుంచి గౌరవం ఆశిస్తారు. ఆఫీసు పనులపై బయటకు వెళ్లాల్సి రావచ్చు. సహోద్యోగులతో మీ స్నేహం పెరుగుతుంది. మీరు ఆసక్తికరమైన పని చేసే అవకాశాలను పొందుతారు. ఎవరితోనైనా విభేదాలుంటే తొలగిపోతాయి.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చ ఉండవచ్చు. మీ పని నిదానంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తెలియని వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకోకండి. విద్యార్థులు చదువుకు బదులు ఇతర పనుల్లో ఎక్కువ సమయం కేటాయిస్తారు.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు మీకు అంత మంచిరోజు కాదు. మళ్లీ పాత వివాదాలు తలెత్తవచ్చు. మీ మంచి సలహాను కూడా ఎవ్వరూ పరిగణలోకి తీసుకోరు. ఎవ్వరినీ అప్పు అడగవద్దు. ఎక్కువ ఆలోచించే బదులు, మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోవడం మంచిది. ఆర్థిక హామీలు ఇవ్వకపోవడం మంచిది.


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. సామాజిక పరిచయం పెరుగుతుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, కార్యాలయంలో మీ పనితీరు బాగానే ఉంటుంది. విద్యార్థులు నిపుణులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. మీ పని సమయానికి ముందే పూర్తవుతుంది.


ABP Desam


తులా రాశి
ఈ రాశివారు అప్పులు తీసుకోకుండా ఉండడం మంచిది. రోజంతా చాలా బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయాలలో చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. చాలా పనులను ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది.


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రాశివారు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారు. పెద్దల సాంగత్యం నచ్చుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి డైట్ కంట్రోల్ యోగా చేయడం మంచిది. ఈరోజు విలువైన బహుమతులు అందుకుంటారు. అపరిచితుడిని వెంటనే నమ్మవద్దు.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రాశి యువత కెరీర్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. సహాయం చేయడం వల్ల మీకు ఆత్మ తృప్తి కలుగుతుంది. మీరు తేలికగా భావించే పని సమస్యలను కలిగిస్తుంది. సన్నిహితుల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సంభాషణలో అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు.


ABP Desam


మకర రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం ఉంటుంది. ఏ పనీ చేయడంలో అలసత్వం వహించవద్దు. మధ్యాహ్నం తర్వాత మీకు శుభవార్తలు అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ABP Desam


కుంభ రాశి
మీ ప్రత్యర్థులు బలహీనపడుతున్నట్లు కనిపిస్తుంది. మీ బాధ్యతలను మీరు పూర్తిగా నిర్వర్తించండి. ఎవరి పట్లా పక్షపాతం చూపవద్దు. ప్రభావశీల వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆగిపోయిన పనులు ప్రారంభించవచ్చు. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. తల్లిదండ్రులతో చర్చించి వారి ఆశీస్సులు పొందడం మంచిది. వివాహ సంబంధాలలో అవగాహన సామరస్యం పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు.