పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం :1 అవమానం : 2
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మీన రాశివారికి సంపదకు కారణమైన గురుడు బలంగానే ఉన్నాడు కానీ ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అక్టోబరు వరకూ అష్టమంలో ఉన్న కేతువు ప్రభావం అధికంగానే ఉంటుంది.
గురుబలం ఉన్నందున ఆదాయానికి లోటుండదు కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక బాధలు తప్పవు . తలపెట్టిన పనులు పూర్తికావు..ప్రతి పనిలోనూ ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి
సాంఘికంగా, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎంత ఓపికగా ఉందాం అనుకున్నప్పటికీ సహనం కోల్పోతారు. కుటుంబ సభ్యులనుంచి కూడా మీపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది
విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి, విదేశీ ప్రయాణాలు మాత్రం కలిసొస్తాయి. రాహు,కేతు ప్రభావం వల్ల కాశీ యాత్ర చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు
ఎలినాటి శని ప్రారంభం అవడం వల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది..ఏదీ కలసిరాక మానసికంగా కుమిలిపోతారు, అలసిపోతారు. గతంలో మీనుంచి సహాయం అందుకున్నవారే ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు,
ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగం మారడం జరుగుతుంది కానీ...గురుబలం వల్ల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నవారికి ఈ ఏడాది కూడా పర్మినెంట్ అవదు.
మీన రాశి విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల జ్ఞాపకశక్తి బాగానే ఉంటుంది. అయితే ఏలినాటి శని కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది.ఎంట్రన్స్ పరీక్షల్లో ఆశించిన దానికన్నా తక్కువ ఫలితం పొందుతారు కానీ సీట్ పొందగలుగుతారు
వ్యాపారులకు ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి మాత్రమే కలిసొస్తాయి. హోల్ సేల్ -రీటైల్ రంగంలో ఉండే వ్యాపారులకు కొంతే అనుకూలిస్తుంది. జాయింట్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవు.
మీన రాశి కళాకారులకు ఈ ఏడాది బాగానే ఉంటుంది. మీరు చేస్తున్న ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. టీవీ, సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు వస్తాయి. జీవితంలో స్థిరత్వం పొందుతారు
మీన రాశికి చెందిన రాజకీయనాయకులకు అంత అనుకూలంగా లేదు. ప్రజలు, అధిష్టానం నుంచి మంచి పేరు పొందలేరు. ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి పాలవక తప్పదు. పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది. డబ్బు అధికంగా ఖర్చు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది
మీన రాశి వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే లాభించును. ఆదాయం పర్వాలేదనిపిస్తుంది. కౌరుదార్లకు బావుంటుంది. చేపలు, రొయ్యల వ్యాపారం చేసేవారికి నష్టాలు తప్పవు. పండ్ల తోటలు నిర్వహించే వారికి లాభం వస్తుంది
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.. Images Credit: Pixabay