Pak Spinner Mohammad Nawaz Asia Cup 2025 | పాక్ స్పిన్నర్ తో భారత్ బ్యాటర్లకు సవాల్! | ABP Desam
పాకిస్తాన్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ బ్యాటర్లపై విరుచుకు పడుతున్నాడు. ఆసియా కప్ ప్రారంభానికి ముందు దుబాయ్ లో జరిగిన ట్రై సిరీస్‌లో నవాజ్ సత్తా చాటాడు. ట్రై సిరీస్ ఫైనల్‌లో అప్ఘనిస్తాన్ టీం ను ఓడించడానికి కీ ప్లేయర్ గా నిలిచాడు. పాకిస్తాన్ - అప్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 75 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో నవాజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులు ఇచ్చాడు. ఐదు వికెట్లు కీలక వికెట్లు తీసాడు.
ఆల్‌రౌండర్ అయిన నవాజ్ బ్యాటింగ్‌లో కూడా రాణించగలడు. ఆసియా కప్ కి ముందే ముందు దుబాయ్ పిచ్‌లపై దుమ్మురేపాడు నవాజ్. తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ట్రై సిరీస్ లో పది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆసియా కప్ లో భాగంగా జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి. సెప్టెంబర్ 14న భారత్ - పాక్ మ్యాచ్ జరగనుంది.





















