Rohit Sharma Virat Kohli Retirement | సిడ్నీ వన్డే ముగిసినా లెజెండ్స్ షాక్ ఇవ్వలేదు | ABP Desam
ఆస్ట్రేలియా తో ఆడేది 3 వన్డే మ్యాచ్ లే కానీ అభిమానుల్లో ఒకటే టెన్షన్. సిరీస్ రిజల్ట్ పై కాదు. తమ ఆరాధ్య క్రికెటర్లు అయిన...దాదాపు 17-18ఏళ్లుగా టీమిండియా క్రికెట్ ను ధృవతారల్లా ఏలుతున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ ఏదైనా షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటారు ఏమో అని. రీజన్ కుర్రాళ్లు దూసుకొచ్చేస్తున్నారు. రెండేళ్లలో వరల్డ్ కప్ ఉంది. టీమ్ ను యువరక్తంతో నింపేయాలని కోచ్ గౌతం గంభీర్ భీష్మించుకుని కూర్చున్నాడు. సో ఈ మూడు వన్డేల ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు చావా రేవో లాంటిది. దానికి తగ్గట్లుగానే మొదటి మ్యాచ్ లో కొహ్లీ డకౌట్, రోహిత్ శర్మ 8పరుగులకు అవుటయ్యాడు. దీంతో రిటైర్మెంట్ న్యూస్ హోరెత్తింది. తిరిగి సెకండ్ వన్డే ఈ సారి రోహిత్ సెవెంటీస్ కొట్టినా...కింగ్ కొహ్లీ మళ్లీ డకౌట్ అయ్యాడు. సిరీస్ కూడా ఆసీస్ కు అర్పితమైపోయింది. మరి మూడో వన్డేలో మళ్లీ ఫెయిల్ అయితే కొహ్లీ ఏమన్నా షాక్ ఇస్తాడా...హిట్ మ్యాన్ మొదటి వన్డేలా ఫెయిల్ అయితే ఆయన కూడా కఠిన నిర్ణయం తీసుకుంటారా అని ఫ్యాన్స్ అంతా కంగారు పడిపోయారు. కానీ అలాంటివేం జరగలేదు. 237పరుగుల ఛేజింగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ తమ వింటేజ్ ఫామ్ ను చూపించారు. రోహిత్ శర్మ తన సెవెంటీస్ టచ్ ను ఈసారి సెంచరీ గా కన్వర్ట్ చేసి కెరీర్ లో 33వ శతకం బాదేస్తే...కింగ్ విరాట్ రెండు డకౌట్లు మనసులో నుంచి తీసేసి ఈ సారి సూపర్ హాఫ్ సెంచరీ బాదేయటంతో పాటు 74పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి సెంచరీ పార్టనర్ షిప్ తో టీమిండియాలో మూడో వన్డేలో గెలిపించి వైట్ వాష్ కాకుండా పరువు కాపాడటంతో పాటు రిటైర్మెంట్ మీద ఎలాంటి ప్రకటన చేయకుండానే మ్యాచ్ ను ముగించారు. ఇద్దరూ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కి మాత్రం థాంక్యూ చెప్పారు. మే బీ మరోసారి వీరిద్దరూ ఆస్ట్రేలియా సిరీస్ కు వచ్చే అవకాశం లేకపోవటంతో తమను ఇన్నేళ్లుగా సపోర్ట్ చేసిన ఆసీస్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. Ro Ko అని మీరెంత అరిచినా మేం ఆగమని ఆటతోనే సమాధానం చెప్పి..రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టారు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ.





















