Women's ODI World Cup 2025 Winner India | టీమిండియా గెలుపులో వాళ్లిద్దరే హీరోలు | ABP Desam
విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాని మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది టీమిండియా. అయితే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడంలో దానికి ఇద్దరు ప్లేయర్లు మోస్ట్ క్రూషియల్ రోలో పోషించారు. వాళ్లే ఓపెనర్ షెఫాలీ వర్మ. ఆల్ రౌండర్ దీప్తి శర్మ. కచ్చితంగా గెలవాల్సిన ఫైనల్ లాంటి మ్యాచ్‌లో.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో భారీ స్కోర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బాధ్యతని డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ భుజానికెత్తుకుంది. ఫాంలో లేదంటూ టీమ్‌లోకి సెలక్ట్ చేయకపోయినా.. అనుకోకుండా ప్రతీకా రావల్ గాయపడటంతో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్న షెఫాలీ.. అదరగొట్టింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన 45 రన్స్ చేసి అవుటైనా.. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్, సెమీఫైనల్ హీరో జెమీమా.. ఫెయిలైనా షెఫాలీ మాత్రం దూకుడు తగ్గించకుండా ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయింది. అయితే షెఫాలీ అవుటైన తర్వాత ఆ బాధ్యతని ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తీసుకుంది. అచ్చం 2011లో యువరాజ్ ఎలా అయితే తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాని ఫైనల్ వరకు తీసుకెళ్లి.. విజేతగా నిలబెట్టాడో.. అలాగే ఈ సిరీస్ మొత్తంలో దీప్తి శర్మ.. సూపర్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో ఒక్కో మ్యాచ్ టీమ్ గెలవడంలో కీ రోల్ పోషించడమే కాకుండా.. ఈ ఫైనల్ మ్యచ్‌లో కూడా ఇంపార్టెంట్ బ్యాటర్లంతా అవుటైపోయిన టైంలో క్రీజులో పాతుకుపోయి.. 57 రన్స్‌తో మోస్ట్ క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడి.. రిచా ఘోష్‌తో కలిసి స్కోర్ బోర్డ్‌ని ముందుకు నడిపింది. దీంతో టీమిండియా 298 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా వీళ్లిద్దరూ ఇరగదీశారు. షెఫాలీ వర్మ లూస్, కాప్ వికెట్లు తీసి.. సఫారీలపై ప్రెజర్ పెంచింది. ఇక దీప్తి శర్మ అయితే సఫారీ సెంచరీ హీరో లోరా వికెట్ తీయడమే.. ఏకంగా 5 వికెట్ హాల్ అందుకుని.. సఫారీ టీమ్ ఓటమిని శాసించింది. అందుకే ఈ ట్రోఫీ గెలవడంలో టీమిండియా ప్లేయర్లందరి ప్రాతినిథ్యం ఉన్నా.. ఈ ఫైనల్ గెలవడంలో మాత్రం కచ్చితంగా షెఫాలీ.. దీప్తి శర్మలదే కీ రోల్.





















