Virat Kohli 2nd Highest Scorer in ODI Cricket | దేవుడు తర్వాత దేవుడిలా మారిన కింగ్ విరాట్ కోహ్లీ | ABP Desam
సిడ్నీ మ్యాచ్ లో ఛేజింగ్ మొదలైంది. 237పరుగుల ఛేజింగ్ లో ఓ వైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దంచుడు మొదలుపెడితే మరో వైపు కెప్టెన్ శుభ్ మన్ గిల్ మరోసారి తక్కువ స్కోరు కే అవుటై పోయాడు. ఆ టైమ్ లో వచ్చాడు కింగ్ విరాట్ కొహ్లీ. బహుశా అతను ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్. అందుకే సిడ్నీ క్రౌడ్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు కొహ్లీకి. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు డకౌట్లు అయిపోయాడు ఏమో కోహ్లీ హేజిల్ వుడ్ బౌలింగ్ లో మొదటి పరుగు తీయగానే గాల్లోకి చేయి ఎత్తి ఎస్ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రీజన్ క్లాస్ ఈజ్ పర్మినెంట్ ఫామ్ ఈజ్ టెంపరరీ. రెండు మ్యాచులు డకౌట్ అయినంత మాత్రాన విరాట్ కొహ్లీ కింగ్ కాకుండా పోతాడా. అందుకే తన కమ్ బ్యాక్ ను సింగిల్ రన్ కే సెలబ్రేట్ చేసుకున్నాడు కింగ్. రోహిత్ శర్మకు సహకరిస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ 150 పరుగుల పార్టనర్ షిప్ ను బిల్డ్ చేశాడు విరాట్. ఈ క్రమంలోనే రోహిత్ తన కెరీర్ లో 33వ శతకం పూర్తి చేసుకుంటే కింగ్ విరాట్ కొహ్లీ 75వ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ కొహ్లీ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర ను వెనక్కి నెట్టి నిలబడ్డాడు. సంగక్కర 404 వన్డేలు ఆడి 14వేల 234 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 305 వన్డేల్లోనే సంగక్కరను దాటేసి సచిన్ తర్వాతి స్థానంలో నిలబడ్డాడు. ప్రస్తుతం కోహ్లీ 14వేల 255పరుగులు చేస్తే...మొదటి స్థానంలో సచిన్ 463వన్డేల్లో 18వేల 426పరుగులు చేశాడు. కోహ్లీ మరో రెండు మూడేళ్లు బీభత్సంగా ఆడితే సచిన్ స్థాయిని చేరుకోవటం కూడా కష్టమేం కాదని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.





















