Sri Jaganmohini Kesava Swami Temple : ముందు నుంచి పురుషుడు.. వెనుక నుంచి స్త్రీ.. ఈ విశేష ఆలయం ఏపీలోనే ఉంది!
Ryali temple history in teluguముందు నుంచి పురుషుడు.. వెనుక నుంచి స్త్రీ.. దేశంలోనే అరుదైన ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది" ర్యాలీ " జగన్మోహిని చెన్నకేశవస్వామి ఆలయం విశేషాలు ఏంటి?
![Sri Jaganmohini Kesava Swami Temple : ముందు నుంచి పురుషుడు.. వెనుక నుంచి స్త్రీ.. ఈ విశేష ఆలయం ఏపీలోనే ఉంది! Sri Jaganmohini Kesava Swami Temple Rare temple of Jagan mohini in Ryali village East Godavari Sri Jaganmohini Kesava Swami Temple : ముందు నుంచి పురుషుడు.. వెనుక నుంచి స్త్రీ.. ఈ విశేష ఆలయం ఏపీలోనే ఉంది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/1ac0531266627b8578f1b26bcdcf3b291738057165121217_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sri Jaganmohini Kesava Swami Temple : దేశంలోనే అరుదైన ఆలయం " జగన్ మోహిని కేశవ స్వామి " దేవాలయం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో "ర్యాలీ " అని ఊరు ఉంది. జనాభా రీత్యా ఊరు చిన్నదే అయినా చారిత్రకంగా ఈ ఊళ్లో దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ముఖ్యమైనది ఈ జగన్మోహని ఆలయం.
11 వ శతాబ్దంలో చోళ రాజులు కట్టించిన ఈ ఆలయం లో 'జగన్ మోహిని కేశవ స్వామి ' విగ్రహం చాలా ప్రత్యేక మైంది. ముందు నుంచి చూస్తే పురుష రూపంలో 'కేశవ స్వామి ' వెనుక వైపు నుంచి చూస్తే స్త్రీ రూపంలో 'జగన్మోహిని' అవతారం దర్శినమిస్తాయి.
సాలగ్రామ శిలతో రూపొందిన ఈ విగ్రహం గోదావరి నదిలో కొట్టుకు వచ్చిందని కొందరు చెబుతారు. దేశంలో అత్యంత అరుదైన ఈ ఆలయం మరింత పాపులర్ కావాల్సిన అవసరం ఉందంటారు స్థానికులు
గర్భగుడిలో కొలువైన విగ్రహానికి ఎన్ని ప్రత్యేకతలో..
5 అడుగుల మూడు అంగుళాల మూలవిరాట్టు పాదాల నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. దీనిని పవిత్ర గంగా జలంగా భావిస్తారు.
మూలవిరాట్టును ముందు నుంచి చూస్తే కేశవ స్వామి నాలుగు చేతులతో శంఖ గదా చక్రాలతో అభయ హస్తం పట్టుకుని దర్శనమిస్తారు. వెనుక నుంచి చూస్తే చక్కటి స్త్రీ రూపం కుడి కాలిపై కాలిపై పాదానికి కాస్త పైన పుట్టుమచ్చ కలిగి ఉంటుంది. నల్లటి సాలగ్రామ శిలపై కూడా మోహిని పుట్టుమచ్చను స్పష్టంగా చూడొచ్చు.
ముందు నుంచి నాలుగు చేతులు కనిపిస్తే ఇక వైపు నుంచి రెండు చేతులే కనిపిస్తాయి. అలాగే స్త్రీ రూపం జుట్టు ముడి వేసుకుని చక్కటి శరీరాకృతితో మలచి ఉంటుంది. విగ్రహం పైన ఆదిశేషుడు ఉంటాడు..
ఏటా చైత్ర శుద్ధ నవమినాడు ఈ ఆలయంలో " "జగన్ మోహిని కేశవ్ కళ్యాణం " జరిపిస్తారు. ఆసమయం లో ఎక్కడెక్కడ నుంచో భక్తులు ' ర్యాలీ' కి చేరుకుంటారు.
Also Read: దశావతారాల్లో ఏడు అవతార ఆలయాలు ఏపీలోనే ఉన్నాయ్.. ఎక్కడున్నాయ్ , మీరెన్ని దర్శించుకున్నారు!
ఈ ఆలయంలో స్వామివారిని ' బదిలీల స్వామిగా' పిలుస్తారు. ఉద్యోగులు ఇక్కడకు వచ్చి స్వామికి పూజలు చేసి బదిలీ కోరుకుంటే వారికి ఉద్యోగంలో నచ్చిన చోటు కు ట్రాన్స్ఫర్ వెంటనే అవుతుందని ఓ నమ్మకం. ఆ విశ్వాసం ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తుంది.
ఈ గుడికి అభిముఖంగా శివాలయం ఉంది. ఇక్కడికి అతి దగ్గరలోనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఇటీవల కాలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం బాగా వృద్ధిలోకి రావడంతో ర్యాలీ ఆలయాన్ని మరింత డెవలప్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో "ర్యాలీ " ఉంది. విజయవాడ నుంచి వస్తే రావులపాలెంలో దిగిపోతే అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది.
Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)