అన్వేషించండి
ఐపీఎల్ 2025 మెగా వేలం! వీరిపై కాసుల వర్షం ఖాయమా ?
ఐపీఎల్ మెగా వేలం 2025 సమీపిస్తున్న కొద్దీ.. ఆటగాళ్ల మార్పులపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత సీజన్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన స్టార్ ఆటగాళ్లు ఈసారి భారీ ధర పలుకుతాడన్న అంచనాలు ఉన్నాయి.

2025 ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలుకుతారన్న అంచనాలు ఉన్న ఆటగాళ్ళు
1/6

భారత బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్..ఈసారి నిర్వహించే మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. 2024 ఐపీఎల్‌లో సర్ఫరాజ్ రూ. 20 లక్షల బేస్ ధరకు వేలంలోకి వచ్చాడు. అయితే అతడిని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు.
2/6

ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో సర్ఫరాజ్ ఖాన్ పై కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.
3/6

ఐపీఎల్ 2024లో అమ్ముడుపోకుండా నిలిచిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 2025 IPL మెగా వేలంలో భారీ ధర పలుకుతాడని భావిస్తున్నారు. 2024 మేజర్ లీగ్ T20లో తన జట్టును స్మిత్ విజేతగా నిలిపాడు.
4/6

కెప్టెన్సీతో పాటు బ్యాట్‌తోనూ స్మిత్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో స్మిత్ కోసం ప్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఆ టోర్నమెంట్లో స్మిత్ 9 మ్యాచ్‌లలో56.00 సగటుతో 336 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
5/6

జోష్ ఇంగ్లిష్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ కూడా IPL 2024లో అమ్ముడు పోలేదు. రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచిన ఇంగ్లిష్ ను ప్రాంచైజీలు పట్టించుకోలేదు. అయితే ఈసారి ఇంగ్లిష్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు ప్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి వికెట్ కీపర్ కావడం.. భారీ షాట్లు ఆడగలగడం ఇంగ్లిష్ కు కలిసిరానుంది.
6/6

ఐపీఎల్ 2024లో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. బేస్ ధర రూ.50 లక్షలతో షంసీ వేలంలోకి వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఈసారి అతనికి మంచి బిడ్ దక్కే అవకాశం ఉంది. షంసీ టీ 20 ప్రపంచకప్ లో మెరుగ్గా రాణించాడు. కాబట్టి ఈసారి భారీ ధర పలికే అవకాశం ఉంది.
Published at : 19 Sep 2024 12:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion