అన్వేషించండి
Guppedantha Manasu Climax: 'గుప్పెడంతమనసు' సీరియల్ అయిపోయింది.. క్లైమాక్స్ ఎపిసోడ్ లో ముగ్గురు మొనగాళ్లు అదిరిపోయారు!
Guppedantha Manasu Serial Climax: గుప్పెడంతమనసు సీరియల్ కి ఆగష్టు 31తో శుభం కార్డ్ పడింది. మొక్కుబడిగా ముగించేయకుండా ఆడియన్స్ కి నచ్చేలా శుభంకార్డ్ వేశారు...

గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

గుప్పెడంత మనసు సీరియల్ కి శుభంకార్డ్ పడింది. 1168 ఎపిసోడ్స్ సాగిన ఈ సీరియల్ ఆగష్టు 31తో ముగిసింది. కొన్ని సీరియల్స్ ఏదో మొక్కుబడిగా ముగించేసినట్టు ఉంటాయి. కానీ గుప్పెడంతమనసు విషయంలో అవసరం అయిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు మేకర్స్
2/7

ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా సీరియల్ కి శుభంకార్డ్ వేశారు. సాధారణంగా క్లైమాక్స్ లో దుర్మార్గులకు బుద్ధివచ్చినట్టే రిషి పెద్దమ్మ దేవయాని మారిపోయింది. కామెడీ విలన్ శైలేంద్ర క్యారెక్టర్ ని ఫుల్ లెంగ్త్ కామెడీగా మార్చేశాడు రిషి...
3/7

తండ్రి ఎవరో తెలియదని నిందలు పడుతూ తనలో తను కుమిలిపోయిన మనుకి తండ్రి, సోదరుడు సహా ఓ పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. పైగా రిషిని పెళ్లిచేసుకోవాలనుకున్న ఏంజెల్ తన సోదరుడు మనుతో ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది.
4/7

మంచి స్నేహితురాలుగా ఉండే అనుపమ క్యారెక్టర్ కి జరిగిన అన్యాయం ఏమీ లేదు.. మొదట్లో ఆమె ఎంట్రీ ఇచ్చినప్పుడు జగతి బదులు వచ్చింది ... మహేంద్ర-అనుపమ మధ్య ఏదో కథ నడిపిస్తారని అంతా అనుకున్నారు ...మనుకి తల్లి అనగానే మహేంద్రని అనుమానించారు. కానీ అదంతా కూడా క్లారిటీ ఇచ్చేశారు
5/7

సీరియల్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన జగతిమేడం క్యారెక్టర్ ని మధ్యలో చంపేసినా...శుభం కార్డ్ పడడానికి ఆమె రాసిన లెటర్ కారణమైంది. అసలు వాస్తవాలు రిషి వరకూ తీసుకెళ్లింది...మను జన్మరహస్యం చెప్పింది జగతి లెటరే...
6/7

మొత్తానికి క్లైమాక్స్ ఎపిసోడ్ లో ముగ్గురు మొనగాళ్లుగా మహేంద్ర-మను-రిషి అదిరిపోయారంతే...
7/7

రిషిధార నవ్వులతో సీరియల్ కి శుభంకార్డ్ పడింది...
Published at : 31 Aug 2024 09:05 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion