Dhoni Animal Ad: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ధోనీ - మరోసారి 'యానిమల్'తో అదరగొట్టారుగా..
Animal Movie Spoof Ad: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రముఖ క్రికెటర్ ధోనీ ఓ యాడ్‌లో కనిపించి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. యానిమల్ స్పూఫ్‌తో చేసిన యాడ్ నవ్వులు పూయిస్తోంది.

Sandeep Reddy Vanga Ad With Dhoni Animal Movie Spoof: ఒకరు స్టార్ డైరెక్టర్.. మరొకరు స్టార్ క్రికెటర్. వీరిద్దరూ కలిసి కనిపిస్తే ఫ్యాన్స్‌కు ఆ కిక్కే వేరు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి ఇంటెన్స్ యాక్షన్ డ్రామా మూవీస్ తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో (Dhoni) కలిసి ఓ యాడ్‌లో నటించి ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు. 'యానిమల్' అవతారంలో ధోనీని స్పెషల్‌గా చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
'యానిమల్' అవతారమెత్తిన ధోనీ.. నవ్వులే నవ్వుల్..
ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రమోషన్స్ కోసం ప్రముఖ కంపెనీ యాడ్ రూపొందించగా.. ఇందులో దోనీ 'యానిమల్' మూవీలో రణబీర్ కపూర్‌లా కనిపించారు. రణబీర్ స్టైల్ లుక్స్‌తో వావ్ అనిపించారు. ఆయనతో పాటు సందీప్ రెడ్డి వంగా సైతం యాడ్ డైరెక్షన్ చేస్తున్నట్లుగా కనిపించి ఎంటర్‌టైన్ చేశారు. సినిమాలో సీరియస్ సీన్స్‌ను ఫన్నీగా చూపించి నవ్వులు పూయించారు.
My favourite animal is when DHONI remembers who he is 🔥 pic.twitter.com/Jgr3MDO28f
— EMotorad (@e_motorad) March 18, 2025
బ్లాక్ కలర్ కారులో బ్లూ కలర్ కోట్ ధరించి సీరియస్‌గా హీరో దిగే సీన్, హీరోయిన్ ఇంటికి సైకిల్‌పై వెళ్లే సీన్, క్లైమాక్స్‌లో హీరో చేతితో సైగ చేసే సీన్‌లో ధోనీ నటించారు. డైరెక్టర్ సందీప్ ఫన్నీగా షూటి చేసి నవ్వించారు. ఈ వీడియోను తాజాగా సదరు కంపెనీ రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది. అయితే, మరో 3 రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ 'స్పిరిట్' మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీని టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్.. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూవీలో ప్రభాస్ 3 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుండగా.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా తరహాలోనే ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

