అన్వేషించండి
Brahmamudi Serial Today March 17th Episode Highlights: గతం మరిచిన రాజ్ కోసం భార్య ఆరాటం, ప్రియురాలు పోరాటం - బ్రహ్మముడి మార్చి 17 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్ ని రామ్ గా మార్చేసింది యామిని. రాజ్ చచ్చిపోయాడని ఇంట్లో అందరూ నమ్ముతున్నా కావ్య మాత్రం తను తిరిగివస్తాడంటోంది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...

Brahmamudi Serial March 17th Episode
1/10

అనామిక అరెస్ట్ తో బ్రహ్మముడి సీరియల్ కి శుభం కార్డ్ పడుతుంది అనుకుంటే యామినిని కొత్తగా తీసుకొచ్చి పెట్టి పాత ఫెయిల్యూర్ లవ్ స్టోరీని ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు
2/10

రాజ్ ని ప్రేమించి వెంటపడిన యామినిని కాలేజ్ డేస్ లో రాజ్ చీధరించుకుంటే పిచ్చెక్కిపోయింది. డ్రగ్స్ కి బానిసైంది. విదేశాలకు పంపించి ట్రీట్మెంట్ చేయించారు తల్లిదండ్రులు. డ్రగ్స్ మత్తు నుంచి బయటపడింది కానీ రాజ్ పై పిచ్చి అలాగే ఉండిపోయింది
3/10

అన్ని సీరియల్స్ లో పెళ్లైన మగాడికోసం పాకులాడే క్యారెక్టర్లో యామిని చెలరేగిపోతోంది. భార్యభర్తకి యాక్సిడెంట్ చేయించి రాజ్ ని ఎత్తుకొచ్చేసింది. గతం మర్చిపోయిన రాజ్ పేరు రామ్ గా మార్చేసింది
4/10

ఇదే తన కుటుంబం అనే భ్రమలో రాజ్ అక్కడే ఉండిపోయాడు కానీ..యామినిని మాత్రం దగ్గరకు చేరనివ్వడం లేదు. అందుకే ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే ప్రూఫ్ ఉంటుందంటారు.ఆ ప్లాన్ లో ఉంటుంది యామిని..తనకు కొంత టైమ్ కావాలంటాడు రాజ్
5/10

మరోవైపు రాజ్ చనిపోయాడని దుగ్గిరాలవారింట్లో అందరూ నమ్ముతున్నా కావ్య మాత్రం రాజ్ వస్తాడని గట్టిగా నమ్ముతోంది. మరోవైపు కేసు రీ ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటుంది అప్పు
6/10

ఇంట్లోంచి బయటకు వెళ్లిన కావ్య.. కార్లో వెళుతున్న రాజ్ ని చూసి పరిగెత్తుతుంది..ఓ దగ్గర కారు ఆపి నిల్చున్న రాజ్ వరకూ వెళ్లి.. కళ్లు తిరిగి పడిపోతుంది
7/10

సాధారణంగా జాలిగుణం ఉండే రాజ్..తనే భార్య కళావతి అని తెలియకపోయినా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు డబ్బు కట్టి వచ్చేస్తాడు
8/10

మెలుకువ వచ్చి చూసి కళావతి.. తన భర్త ఏడని హాస్పిటల్లో ఆరా తీసి అంతా వెతికేస్తుంది. ఆమె బయటకు వచ్చేసరికి రాజ్ వెళ్లిపోతాడు
9/10

మరోవైపు కావ్య పిచ్చిదైపోయిందని కూస్తుంది రుద్రాణి.. ఇంట్లో వాళ్లంతా రుద్రాణిపై విరుచుకుపడుతుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన కావ్య తాను రాజ్ ని చూశాను అని చెబుతుంది.. అంతా షాక్ అవుతారు
10/10

ఇప్పుడు అప్పు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది..యామిని దగ్గరున్న రాజ్ ని గుర్తించినా ఆమె మాత్రం గట్టిపట్టుదలగా ఉంది. మరి రాజ్ తిరిగి తన ఇంటికి చేరేదెప్పుడో..
Published at : 16 Mar 2025 12:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion