అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu February 21st Episode Highlights: బాలుకి గులాబి ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన మీనా..కుళ్లుకున్న ప్రభావతి - గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 21 ఎపిసోడ్ హైలెట్స్
Gunde Ninda Gudi Gantalu February 21st Episode : మీనా - బాలుని ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది ప్రభావతి. గుండె నిండా గుడి గంటలు ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్

Gunde Ninda Gudi Gantalu February 21st Episode
1/8

మీనాతో పూలషాప్ పెట్టిస్తాడు బాలు. అందుకోసం బాలు ఎంత కష్టపడ్డాడో మీనా పుట్టింటివాళ్లు, ఆ చుట్టుపక్కవాళ్లు, బాలు స్నేహితులు చెబుతారు. మీనా మురిసిపోతుంది
2/8

శృతితో షాప్ ఓపెన్ చేయిస్తాడు బాలు. మావగారు సత్యం..మొదటగా డబ్బులిచ్చి పూలు కొంటాడు. అంతా కంగ్రాట్స్ చెబుతారు. బాలు మంచి ఆలోచన అంటూ పొగిడేస్తారు.
3/8

బట్టలు ఉతినందుకు డబ్బులిచ్చిన శ్రుతికి... రిబ్బన్ కట్ చేసినందుకు తిరిగి ఆ డబ్బులు ఇప్పిస్తాడు. నీకు విలువ కట్టింది కదా అందుకే తను చేసిన పనికి విలువకట్టి ఇచ్చానంటాడు బాలు
4/8

నీ పెద్దకోడలు పార్లర్ కి నీ పేరు పెట్టుకుంది అన్నావ్..ఇప్పుడు నీ చిన్నకోడలు కూడా పూలకొట్టుకి నీ పేరు పెట్టుకుంది అంటాడు.
5/8

పూలకొట్టుకి నా పేరు పెట్టి పరువు తీస్తున్నారని ప్రభావతి ఫైర్ అవుతుంది. అలా ఎవరు అనుకుంటున్నారో చెప్పమంటాడు సత్యం. ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ప్రభావతి చిన్నతనంగా ఉందంటుంది..
6/8

బాలు చేసిన పన నచ్చలేదని కోపంగా అంటుంది. ఇంతలో కామాక్షి కాల్ చేసి మరింత ఆజ్యం పోస్తుంది. మీనాను అస్తమానం పూలు కుట్టుకునేది అనేదానివి కదా..అదిప్పుడు నీపైకే వచ్చిందని సెటైర్ వేస్తుంది. పూలకొట్టు ఏర్పాటు తర్వాత వరుస ఫోన్ కాల్స్ చూసి ప్రభావతి విసిగిపోతుంది.
7/8

కావాలనే 2 వేలు ఇప్పించాడంటూ బాలుపై ఫైర్ అవుతుంది శ్రుతి. నేనిచ్చిన దానికన్నా 500 ఎక్కువ ఇచ్చి మరింత అవమానించాడంటుంది. రవి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు
8/8

గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 22 ఎపిసోడ్ లో ... ఇక ఈ జీవితం మొత్తం వంటగదికే పరిమితమా అని బాధపడ్డాను..కానీ మీవల్ల మొత్తం మారిపోయిందని సంతోషంగా చెబుతుంది మీనా. ఇప్పుడేం చూశావ్ దీన్ని ఇంకా డవలప్ చేద్దాం అని భరోసా ఇస్తాడు బాలు. కళ్లుమూసుకోండి అని చెప్పి గులాబీ ఇస్తుంది మీనా
Published at : 21 Feb 2025 09:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion