అన్వేషించండి
Tollywood Stars cast their vote: పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టిన టాలీవుడ్ యంగ్ స్టార్స్... పిఠాపురంలో ఉప్పెన దర్శకుడు
South stars cast their vote in Hyderabad & Andhra Pradesh: టాలీవుడ్ యంగ్ హీరోలు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎన్నికల్లో ఓటేసిన యువ తారలు... ఎవరెక్కడ ఓటు వేశారో తెలుసా?
1/16

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు. జూబ్లీ హిల్స్ విమెన్స్ కాలేజీలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. చైతూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/16

''దీప్తి ఓటు వేసింది. నేను కూడా'' అని నటి దివ్య శ్రీపాద సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. తాను ఓటు వేశానని, ప్రజలందరూ ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
3/16

'ఉప్పెన' దర్శకుడు, త్వరలో రామ్ చరణ్ హీరోగా సినిమా చేయనున్న సానా బుచ్చిబాబు పిఠాపురం నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
4/16

స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి మొగల్తూరులో ఓటు వేశారు.
5/16

యువ హీరో సందీప్ కిషన్ తెలంగాణలో ఓటు వేశారు. ప్రజలను ఓటు వేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు.
6/16

గుడివాడ టౌన్ హైస్కూల్లో దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, ఆయన సతీమణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
7/16

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్... ఆయన తండ్రి & ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దంపతులు జూబ్లీ హిల్స్ లో ఓటు వేశారు.
8/16

ఓటు వేసిన ఆది సాయి కుమార్
9/16

హీరో తరుణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.
10/16

నటి హంసా నందినితో పాటు ఆయన తండ్రి సైతం ఈ రోజు ఓటు వేశారు.
11/16

ఓటు వేసి తన బాధ్యత నిర్వర్తించిన అల్లు శిరీష్
12/16

యాంకర్ ప్రదీప్ మాచిరాజు తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.
13/16

ఓటు వేసిన 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ
14/16

గుంటూరులోని పట్టాభిపురం బేసిక్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా, సిద్దార్థ్ గల్లా... ఆయన కుమారుడు, హీరో అశోక్ గల్లా.
15/16

ఓటు వేసిన హీరో, 'బిగ్ బాస్' ఫేమ్ శివాజీ
16/16

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన సొంతూరు రాయచోటిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Published at : 13 May 2024 01:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion