అన్వేషించండి

Viral News: పీవీఆర్‌కు వెళ్తే అరగంట యాడ్స్ వేసి టైం వేస్ట్ చేశారా - అయితే మీకు లక్ష కట్టాల్సిందే ! ఇవిగో డీటైల్స్

Bengaluru: మల్టిప్లెక్స్ లో సినిమాకు వెళ్తే కనీసం ఇరవై నిమిషాల నుంచి అర గంట యాడ్స్ వేస్తారు. ఇలా టైం వేస్ట్ చేస్తే వారు జరిమానా కట్టాల్సిందే.

PVR INOX:  మధ్యాహ్నం పన్నెండు గంటలకు సినిమా అని టిక్కెట్ బుక్ చేసుకుంటాం. ఠంచన్ గా వెళ్లి కూర్చుకుంటాం. కానీ అసలు సినిమా పన్నెండున్నరకు ప్రారంభమవుతుంది. అంటే అరగంట సేపు ప్రకటనలు వేస్తారు. మళ్లీ ఇంటర్వెల్ లో ప్రకటనలు వేస్తారు. రెండున్నర గంటల సినిమా కదా అని దానికి తగ్గట్లు టైమ్ షెడ్యూల్ చేసుకుని వెళ్తే..  ఆ ప్రకటనలు చూపించేందుకు మన టైం అరగంట వేస్ట్ చేస్తారు. ఇలా ఓ వ్యక్తి టైమ్ ఈజ్ మనీ అనుకుని తన మనీని వేస్ట్ చేశారని న్యాయపోరాటం చేశాడు. అతని వాదనలో నిజం ఉందని చెప్పిన కోర్టు అతనికి లక్ష కట్టాలని తీర్పు ఇచ్చింది.

బెంగళూరులో నివాసం ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ అనే సినిమాకు వెళ్లాుడు.  సామ్ బహదూర్ షో సాయంత్రం 4:05 అని పీవీఆర్ ఐనాక్స్ మెసెజ్ చేసింది.  సినిమా సాయంత్రం 6:30 కి ముగిసిపోతుందని.. తర్వాత తాను డ్యూటీకి వెళ్లవచ్చని అనుకున్నాడు. కానీ  సుదీర్ఘ ప్రకటనలతో ఆయన టైం టేబుల్ తప్పింది.  తన సమయాన్ని వృధా చేసినందుకు PVR సినిమాస్, బుక్‌మైషో , INOX లపై అభిషేక్ కేసు పెట్టాడు. చెప్పిన సమయం కన్నా అరగంట ఆలస్యంగా సినిమా ప్రారంభించారని తన సమయాన్ని వృధా చేశారని వినియోగదారులకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

ఈ రోజుల్లో టైమ్ ఈజ్ మనీ అని తన సమయాన్ని వృధా చేసి, డబ్బు దోపిడీ చేసే హక్కు లేదని వాదించారు. అభిషేక్ వాదనతో జిల్లా  వినియోగదారుల ఫోరం  ఏకీభవించింది. బిజీగా ఉన్న వ్యక్తులకు థియేటర్‌లో 25-30 నిమిషాలు అనవసరమైన ప్రకటనలు చూడటం కష్టమని  స్పష్టం చేసింది.   జిల్లా వినియోగదారుల ఫోరం PVR ,  INOX లు వినియోగదారుకు ను మానసిక వేదన కలిగించాయని,  అసౌకర్యానికి గురి చేశాయని స్పష్టం చేసింది.  ఫిర్యాదుదారుని రూ. 20,000 అలాగే చట్టపరమైన ఖర్చుల కింద  8,000 చెల్లించాలని ఆదేశించింది.   అధిక ప్రకటనలు వేసినందుకు  అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

ప్రజా సేవా ప్రకటనలను  ప్రదర్శించడం తప్పనిసరి అని సినిమా థియేటర్లు వాదించాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విధంగా, ముఖ్యమైన సామాజిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి థియేటర్లు చట్టబద్ధంగా  ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పాయి. అయితే ఆ కారణంతో ఇతర ప్రకటనలు ప్రదర్శించి సమయం వృధా చేయడం మంచిదికాదని తెలిపింది. అంతే కాదు.. సినిమా టిక్కెట్ పై అసలు ప్రదర్శన సమయాన్ని .. అంటే సినిమా ప్రారంభించే సమయాన్ని పేర్కొనాలని ఆదేశించింది.  

ఇప్పుడు మల్టిప్లక్స్ లో సినిమాకు వెళ్లి అరంగట పాటు యాడ్స్ టార్చర్ అనుభవించిన వారంతా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి బెంగళూరు కోర్టు తీర్పు ను చూపిస్తే..  మల్టిప్లెక్స్ అందరికీ పరిహారం చెల్లించాల్సి రావచ్చు.       

Also Read: బిఎస్‌ఎన్‌ఎల్‌కు టైం వచ్చింది! 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా లాభాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Digvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP DesamRishabh Pant Poor form 27Cr Auction price | IPL 2025 లో ఘోరంగా విఫలమవుతున్న పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
Nani: నాని సినిమాలో మరో హీరో... 'హిట్ 3'లోకి పోలీస్‌గా ఖైదీ వస్తాడా?
నాని సినిమాలో మరో హీరో... 'హిట్ 3'లోకి పోలీస్‌గా ఖైదీ వస్తాడా?
Cheapest Data Plans: ఎయిర్‌టెల్‌, జియో, BSNLలో ఈ డేటా ప్లాన్స్‌ బహు చవక! హ్యాపీగా IPL చూడండి
ఎయిర్‌టెల్‌, జియో, BSNLలో ఈ డేటా ప్లాన్స్‌ బహు చవక! హ్యాపీగా IPL చూడండి
Shree Siddhivinayak Bhagyalakshmi: ఈ ఆలయంలో వినాయకుడి ఆదాయం రూ.133 కోట్లు -  ఆడపిల్లల తల్లుల అకౌంట్లో ఎంత పడుతుందో తెలుసా !
ఈ ఆలయంలో వినాయకుడి ఆదాయం రూ.133 కోట్లు - ఆడపిల్లల తల్లుల అకౌంట్లో ఎంత పడుతుందో తెలుసా !
ETV Win OTT Release: 4 సినిమాలు, 3 వెబ్ సిరీస్‌లు, సర్‌ప్రైజ్‌లు ఎన్నో - ఏప్రిల్‌ 2025లో 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవే
4 సినిమాలు, 3 వెబ్ సిరీస్‌లు, సర్‌ప్రైజ్‌లు ఎన్నో - ఏప్రిల్‌ 2025లో 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవే
Embed widget