అన్వేషించండి

Costly Trees In India: నూరేళ్ల వ‌య‌స్సున్న చెట్టు.. ధ‌ర చూస్తే క‌ళ్లు బైర్లు కమ్మాల్సిందే..! ఎక్కడో కాదు ఏపీలోనే

East Godavari News | క‌డియం న‌ర్స‌రీలో సిల్క్ ఫ్లోస్ ట్రీ ఒక‌టి అబ్బుర ప‌రుస్తోంది.. వీటి ధ‌ర చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే... ఈ విదేశీ జాతికి చెందిన ఈ మొక్క ధ‌ర రూ.33ల‌క్షలు ప‌లుకుతోంది.

Kadiyam Nursery | దేశ విదేశాల‌కు చెందిన విభిన్న మొక్క‌ల‌తో క‌నువిందు చేసే క‌డియం న‌ర్స‌రీలో ఏదో ఓ ప్ర‌త్యేక‌త క‌నిపిస్తూనే ఉంటుంది.. అందుకే భారత కుబేరుడు ముఖేష్ అంబానీ అంత‌టి వాడే నేరుగా త‌న వారిని క‌డియం పంపించి తాను గుజ‌రాత్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన పార్కులో ఇక్క‌డి నుంచే ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించి మొక్క‌ల‌ను తీసుకెళ్లారు... ఒక‌ప్ప‌డు దేశీయ జాతుల‌కు చెందిన మొక్క‌ల‌ను అభివృద్ధి చేసే ప‌ద్ద‌తి నుంచి మ‌రికొన్నాళ్ల‌కు విదేశీజాతుల మొక్క‌ల‌ను క‌డ‌యం న‌ర్స‌రీల్లోనే అభివృద్ధి చేసే స్థాయికి చేరుకున్నారు ఇక్క‌డి రైతులు. 

విభిన్నంగా ఆలోచించి ఏకంగా విదేశాల్లో వందేళ్ల వ‌య‌సున్న మొక్క‌ల‌ను ప్ర‌త్యేక కంటైన‌ర్లు ద్వారా ఇక్క‌డికి ర‌ప్పించి అంత‌ర్జాతీయ స్థాయి న‌ర్స‌రీ మార్కెట్‌తో పోటీప‌డుతున్నారు.. ఇదిలా ఉంటే క‌డియం న‌ర్స‌రీలో ఇప్ప‌డు ఓ అరుదైన ఏళ్ల‌నాటి చెట్టు అంద‌రినీ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది.. ఎన్నో వెరైటీ బోన్సాయ్ మొక్క‌ల‌ను అభివృద్ధి చేసి న‌ర్స‌రీల నిండానింపిన అనుభ‌వం ఉన్న క‌డియం న‌ర్స‌రీ రైతులు తాజాగా తీసుకువచ్చిన  భారీ ఆకారంగ‌ల బోన్సాయ్ చెట్ల‌తో వృక్ష ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ర్షిస్తున్నారు. 

 వందేళ్ల చెట్లు.. అంద‌రి దృష్టి వాటిపైనే..
 తూర్పుగోదావ‌రి జిల్లాలోని క‌డియంలో  శ్రీ శివాంజనేయ నర్సరీ రైతు మల్లు పోలరాజు మూడు రోజుల క్రితం విదేశాల నుంచి వీటిని తీసుకొచ్చిన చెట్లు ఇప్ప‌డు అంద‌రినీ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది..   భారీ ఆకారంలో క‌ల‌సాన్ని పోలి ఉన్న ఈ భారీ వృక్షాలు అందర్నీ అబ్బుర పరుస్తున్నాయి. ఈ చెట్టును "సిల్క్ ప్లోస్ ట్రీ అని పిలిచే దీని శాస్త్రీయ నామం Chorisia speciosa. వీటిని ప్రత్యేక కంటైనర్ ఉంచి 75 రోజుల క్రితం షిప్ లో వేస్తే చెన్నై నుంచి ఇక్క‌డికి తీసుకువ‌చ్చారు.  దక్షిణ అమెరికా దేశంలో విరివిగా ఉండే ఈ మొక్కలను స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల్లో విక్రయాలు చేపడుతున్నారు. పెద్దపెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్ లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుకుంటుంటార‌ని న‌ర్స‌రీ య‌జ‌మాని తెలిపారు. ఈ చెట్టు వయసు వంద నుంచి నూట ఇరవై ఏళ్లు ఉంటుంద‌ని చెప్పారు.. క‌డియం న‌ర్స‌రీలో ఉన్న ఈ చెట్లు ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని చిలుకూరు స‌మీపంలో నిర్మించిన ఎక్స్‌పీరియం లో ఉన్నాయ‌ట‌.. 

రూ.33 ల‌క్ష‌లు పెట్టి ద‌ర్జాగా తీసుకెళ్ల‌వ‌చ్చు..
 
సాధార‌ణంగా బోన్సాయ్ మొక్క‌లు అంటేనే చాలా ఖ‌రీదైన‌విగా చెబుతుంటారు. ఇంత ఖ‌రీదు ఎందుకు అంటే ఏళ్ల త‌ర‌బ‌డి వీటిని ఓ ప్ర‌త్యేక రూపంలోకి మ‌ళ్లించేందుకు చాలా ప్ర‌యాస ప‌డుతుంటారు. అంతేకాకుండా కొన్ని ప్ర‌త్యేక వాతావ‌ర‌ణంలో కూడా వీటిని కాపాడుకోవాల్సి ఉంటుంది.. కావాల్సిన ఆకృతిలోకి మ‌ళిచేందుకు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది..  అయితే ఇప్ప‌డు క‌డియం న‌ర్స‌రీలో ద‌ర్శ‌న‌మిస్తున్న ఈ అరుదైన వృక్షం సొంతం చేసుకోవాలంటే మాత్రం క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే.. ఈ అరుదైన చెట్లు విషయానికి వస్తే ఒక్కొక్కటి రూ.35 నుంచి 40 లక్షలు ఉంటాయి.

కాగా, న‌ర్స‌రీలో ఉన్న ఈ చెట్టు ధ‌ర రూ.33 ల‌క్ష‌లు అని న‌ర్స‌రీ య‌జ‌మాని తెలిపారు. ప్రస్తుతం మోడులుగా కనిపిస్తున్న వీటికి చిన్నచిన్న కొమ్మలు వచ్చి రంగురంగుల పువ్వులు పూస్తాయి. అప్పుడు మరింత శోభాయమానంగా నీ మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. ప్రపంచ నర్సిరీ రంగంలో ఏమాత్రం తీసి పోమని చాటి చెప్పడానికే వీటిని ఇక్కడకు తీసుకొచ్చినట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.

Also Read: Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget