అన్వేషించండి

HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!

Hyderabad News: హైడ్రా తీరు మరింది.. వ్యూహం మారింది.. రాత్రికి రాత్రి బుల్డోజర్లతో అక్రమనిర్మాణాలు నిర్దాక్ష్యణ్యంగా కూల్చివేసే హైడ్రా..ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయడమేకాదు.వారెవ్వా అనేలా చేస్తోంది

HYDRA Latest News: హైదరాబాద్‌లో దశాబ్దాల చరిత్ర కలిగిన చెరువులను ఆక్రమణ కోరల నుంచి రక్షించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన హైడ్రా యాక్షన్ మొదలైన తొలిరోజుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే హైడ్రా హైస్పీడ్ యాక్షన్ ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడమే కాదు, ప్రతిపక్షాలకు పోరాట అస్త్రాలను ఇచ్చింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ నేతృత్వంలో మొదటి నుంచి వేసిన ప్రతీ అడుగూ వివాదమే అయింది. ప్రతీ కూల్చివేతలో రాజకీయ రాద్దాంతమే జరిగింది. 

నాగార్జున ఎన్‌కన్వెషన్ మొదలు బడా బాబుల భవంతులు, పేరు మోసిన నిర్మాణాల వరకూ ఎవర్నీ వదల్లేదు హైడ్రా. మీడియా ఉతికి ఆరేసినా, ప్రతిపక్షాలు ఏకిపారేసినా.. డోన్ట్ కేర్ అంటూ హైస్పీడ్ బుల్డోజర్‌లా దూసుకెళ్లింది. హైడ్రాకు హైకోర్టు బ్రేక్‌లు వేసింది. సెలవురోజుల్లో కూల్చివేతలు ఎందుకంటూ నిలదీసింది. నలువైపుల నుంచి వచ్చిన విమర్సలు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా హైడ్రా స్పీడ్ తగ్గింది. వ్యూహం మారింది. ఇప్పుడు ఆచి తూచి అడుగులేస్తూ యాక్షన్‌లోకి దిగుతోంది. 

హైడ్రా కూల్చివేతల వల్ల ఎంతో మంది ఇళ్లు కోల్పోయారు. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇంత జరుగుతున్నా హైడ్రా మాత్రం మా లక్ష్యం చెరువుల పునరుద్దరణ, భావితరాల భవితవ్యం అంటూ చెప్పుకొస్తోంది. నేటీకి అదే సంకల్పంతో ముందుకు సాగుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన హైడ్రా లక్ష్యం సరైనదే, విమర్శలను ఎదిరించిన చేసిన పనిలో న్యాయమైందే అని నిరూపించింది. 

బతుకమ్మ కుంట చెరువు హైడ్రా చర్యలను సమర్థించింది. అంబర్‌పేట మండలంలోని బాగ్ అంబర్ పేటలో ఉన్న బతుకమ్మ కుంట చెరువు దాదాపు ఎనభై శాతంపైగా ఆక్రమణకు గురైంది. 16 ఎకరాలు చెరువు కాస్తా 5 ఎకరాలకు వచ్చింది. అది కూడా పూర్తిగా ముళ్లకంచెలతో నిండిపోయి. దీన్ని కూడా కబ్జాదారులు హస్తగతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో స్థానికులు సమస్యను హైడ్రాకు చేరవేశారు. మా బతుకమ్మ కుంటను బతికించండి అంటూ వేడుకున్నారు.

Also Read: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, విజ‌య‌వాడ రూట్‌లో వెళ్లేవారికి రాయితీ ప్రకటన

రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్‌లు ఈసారి చెరువు ఆక్రమించి ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతంలో ముళ్లకంచెలు తొలిగించేందుకు రెడీ అయింది. అలా బుల్డోజర్లు భూమిని తాకగానే గంగమ్మ ఉబికి వచ్చింది. ఇన్నాళ్లు నన్ను మింగిన ఆక్రమణలు, కబ్జా తిమింగలాల నుంచి రక్షించడానికే వచ్చావా హైడ్రా అంటూ ఆనందంతో పరవళ్లు తొక్కింది. ఇక్కడ చెరువు లేదు అన్నవాళ్ల నోళ్లు మూయించేలా బతుకమ్మకుంటలో దాగిన నిజం వెలుగులోకి వచ్చింది. 

తొలిరోజుల్లో హైడ్రా అయితే చెరువు ఆక్రమించి కట్టిన ఇళ్లు కూల్చివేసి 16 ఎకరాల చెరువును వెలుగులోకి తెచ్చేది కానీ మారిన హైడ్రా అలాంటి సాహసం చేయలేదు.  మిగలిన 5 ఎకరాలు బాగుచేసి చెరువును సుందరీకరణ చేసే పనిలో నిమగ్నమైంంది. ఈ బతుకమ్మ కుంట చెరువు వద్ద ఉబికి వచ్చిన నీరు అనేక ప్రశ్నలకు సమధానం మాత్రమే కాదు... హైడ్రాను తిట్టిపోస్తున్న గొంతుకులకు ఆనకట్ట కట్టింది. 

హైడ్రా అన్ని చెరువులను రక్షిస్తే, పాతాళంలో దాగిన భూగర్భ జలాలు పైకి ఉబికి కుంటలు, చెరుల కొత్త జీవం పోసుకుంటే ఓసారి ఊహించండి. భారీ వర్షాలకు ముంపు అనే మాట కనుచూపుమేరలో వినపడుదు. తాగునీటి సమస్యకు సైతం పరిష్కారం చూపడమేకాదు, భావి తరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వొచ్చు. ఇదే కదా హైడ్రా చెప్పింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదేకదా ఇప్పుడు బతుకమ్మ కుంటతో రుజువైందని అంటున్నారు. అందుకే విమర్శించిన గొంతులు సైతం ఇప్పుడు వారెవ్వా హైడ్రా అంటున్నాయి. 

Also Read: మోకాలు లోతు తవ్వగా ఉప్పొంగిన గంగ, హైదరాబాద్‌లో ఫలిస్తున్న హైడ్రా చర్యలు - స్థానికులు హర్షం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget